E-Paper
Advertisement

ముఖ్యమంత్రిగా విజయ్.. జీతం, ఇతర బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

ముఖ్యమంత్రిగా విజయ్.. జీతం, ఇతర బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
Advertisement

Vijay Thalapathy:సినిమా రంగానికి, రాజకీయ రంగానికి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది ..అందుకే రాజకీయాలలో ప్రజల మన్ననలు పొందిన ఎంతోమంది ఇప్పుడు సినిమా వైపు అడుగులు వేస్తుంటే.. సినిమా రంగంలో హీరోలుగా, హీరోయిన్లుగా ఉన్నత స్థాయిని అందుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాలలో చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా కూడా అవతరించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో ఎన్టీఆర్ , ఎంజీఆర్ లతోపాటు నేటి కాలంలో పవన్ కళ్యాణ్ వంటి హీరోలు కూడా రాజకీయం రంగంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు విజయ్ దళపతి. ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత ఆ ఘనత దక్కించుకున్న హీరోగా రికార్డ్ సృష్టించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్..

తమిళనాడులో టీవీకే అనే పార్టీని స్థాపించి, అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి 234 స్థానాలకు గానూ.. 108 స్థానాలను కైవసం చేసుకున్నారు. అంతేకాదు తమిళనాడులో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఇక కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల మద్దతుతో 118 సీట్లను సొంతం చేసుకొని.. నిన్న గవర్నర్ సమక్షంలో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అతిరథ మహారథుల సమక్షంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. స్టేడియం లోపలే కాదు వెలుపల కూడా అభిమానులు, ప్రజలు..” దళపతి.. దళపతి” అంటూ నినాదాలతో చెన్నై మొత్తం మారుమ్రోగేలా చేశారు. ఇకపోతే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టడంతో విజయ్ కి జీతం ఎంత వస్తుంది? ఇతర బెనిఫిట్స్ ఏంటి ?అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ముఖ్యమంత్రిగా విజయ్ జీతం..

Advertisement

ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళనాడులో ముఖ్యమంత్రికి నెలకు సుమారుగా రూ.2.85 లక్షల నుండి రూ.3 లక్షల వరకు (అలవెన్స్ లతో కలిపి) జీతం ఉంటుంది. మంత్రులకు సుమారుగా రూ.2.50 లక్షలు, ఎమ్మెల్యేలకు రూ.1.05 లక్షల నుంచి రూ.1.15 లక్షల వరకు వేతనాలు లభిస్తాయి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి జీతం.. ఆదాయపు పన్ను శాఖలో శాలరీ కింద పరిగణించబడుతుంది. అంటే సాధారణ ఉద్యోగిలాగే ముఖ్యమంత్రి కూడా పన్ను చెల్లించాలి..కానీ ఎమ్మెల్యేలు , ఎంపీల ఆదాయం మాత్రం అదర్ సోర్సెస్ కింద లెక్కించబడుతుంది. ఇకపోతే విజయ్ తన అఫిడవిట్లో సుమారుగా రూ. 624 కోట్లు ఆస్తులు ఉన్నట్టు ప్రకటించగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చే జీతంతో కూడా కలిపి పన్ను పరిధిలోకి రావడం చర్చనీయాంశంగా మారింది. సినిమాల ద్వారా వందల కోట్లు సంపాదించిన వ్యక్తి.. ప్రజల సేవ కోసం నెలకు కేవలం లక్షలు జీతంతో పని చేయడం అటు రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

also read:లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి.. ఖరీదు ఎంతంటే?

ముఖ్యమంత్రికి లభించే ఇతర బెనిఫిట్స్..

Advertisement

ముఖ్యమంత్రిగా విజయ్ కి లభించే ఇతర బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ముఖ్యమంత్రులకు ఉచిత అధికారిక బంగ్లా కేటాయిస్తారు . ఇంటి అద్దె, టెలిఫోన్ అలవెన్స్ తో పాటు ఇతర పరిపాలన భత్యాలు కూడా ఉంటాయి. ఉచిత ప్రయాణ సౌకర్యాలు, విమాన ప్రయాణాలు , ఉచిత కార్లు కూడా సమకూరుస్తారు . ముఖ్యమంత్రి అలాగే వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సదుపాయాలు కూడా ఉంటాయి. జెడ్ ప్లస్ లేదా ఉన్నత స్థాయి భద్రతా సిబ్బందిని కల్పిస్తారు. పదవీ విరమణ తర్వాత మాజీ ముఖ్యమంత్రులకు పెన్షన్ అలాగే ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి. మొత్తానికైతే ఇవన్నీ విజయ్ కి వర్తిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×