E-Paper
Advertisement

‘పెద్ది’లో ఆ సీన్ గురించి ముందే హింట్ ఇచ్చేసిన రత్నవేలు.. ఫ్యాన్స్ ఖుషీ..

‘పెద్ది’లో ఆ సీన్ గురించి ముందే హింట్ ఇచ్చేసిన రత్నవేలు.. ఫ్యాన్స్ ఖుషీ..
Advertisement

Peddi Cricket: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా గురించి తాజాగా లెజెండరీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు షేర్ చేసిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read also-హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోబోతున్నారా? దానివల్ల కలిగే సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే

పగలు జరగాల్సిన మ్యాచ్..

Advertisement

ఈ సినిమాలో క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల ప్రాధాన్యత గురించి రత్నవేలు మాట్లాడుతూ ఒక కీలక మార్పు గురించి వివరించారు. “సినిమాలో ఒక క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. కానీ దానికంటే ముఖ్యమైన రెండవ క్రికెట్ మ్యాచ్ ఒకటి ఉంది. అది ఎమోషనల్‌గా చాలా డీప్ సీన్. నిజానికి ఆ సీక్వెన్స్‌ను పగటిపూట చిత్రీకరించాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ నేను బుచ్చిబాబు, చరణ్‌లకు ఒక సలహా ఇచ్చాను. ఆ సీన్‌ను రాత్రి పూట షూట్ చేస్తేనే అందులోని ఎమోషన్ పీక్స్‌లో ఉంటుందని చెప్పాను.” అందుకే ఆ సీన్ రాత్రి

రత్నవేలు మాస్టర్ ప్లాన్

ఒక టెక్నీషియన్‌గా రత్నవేలు ఈ మార్పు కోరడం వెనుక బలమైన కారణం ఉంది. పగటి పూట షూట్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే విషయాల వల్ల ప్రేక్షకుల దృష్టి మళ్లే అవకాశం ఉంటుంది. అదే రాత్రి పూట లైటింగ్ ఎఫెక్ట్స్‌తో కేవలం పాత్రల మీద మాత్రమే ఫోకస్ ఉండేలా చేయవచ్చు. నైట్ సీక్వెన్స్‌లో ఉండే ఇంటెన్సిటీ ప్రేక్షకుడిని కథలోకి మరింత లోతుగా తీసుకెళ్తుంది. ఆ మ్యాచ్‌లో ఉండే గెలుపోటముల కంటే, ఆ సమయంలో పాత్రల మధ్య ఉండే భావోద్వేగాలే హైలైట్ అవ్వాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Read also-‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్ర గురించి ఫుల్ డిటైల్స్ చెప్పేసిన రత్నవేలు.. పాపం బుచ్చిబాబు!

ఫ్యాన్స్‌ క్యూరియాసిటీ

బుచ్చిబాబు సానా కథలు ఎప్పుడూ ఎమోషనల్ గా స్ట్రాంగ్‌గా ఉంటాయి. దానికి రత్నవేలు విజువల్స్ తోడైతే అది ఒక విజువల్ వండర్ అవుతుందనడంలో సందేహం లేదు. రత్నవేలు మాటలను బట్టి చూస్తే, ఈ సినిమాలో రామ్ చరణ్‌లోని అసలైన నటుడిని మనం మరోసారి చూడబోతున్నామని అర్థమవుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×