E-Paper
Advertisement

‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్ర గురించి ఫుల్ డిటైల్స్ చెప్పేసిన రత్నవేలు.. పాపం బుచ్చిబాబు!

‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్ర గురించి ఫుల్ డిటైల్స్ చెప్పేసిన రత్నవేలు.. పాపం బుచ్చిబాబు!
Advertisement

Janhvi Introduction: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (PEDDI). ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఒక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న జాన్వీ కపూర్ పాత్ర గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read also-దళపతి విజయ్ ప్రసంగిస్తుంటే త్రిష ఏం చేసిందో తెలుసా?.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..

ఇంట్రడక్షన్ రేంజే వేరు..

Advertisement

కెమెరా మెన్ రత్నవేలు చెప్పిన వివరాల ప్రకారం, ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ ఇంట్రడక్షన్ సీన్ అత్యంత విభిన్నంగా ఉండబోతోంది. సాధారణంగా స్టార్ హీరోయిన్ల ఎంట్రీ అంటే గ్లామరస్‌గానో లేదా సాంగ్‌తోనో ఉంటుంది. కానీ, బుచ్చిబాబు ఈ చిత్రంలో జాన్వీ పాత్ర ప్రవేశాన్ని చాలా కొత్తగా డిజైన్ చేశారని, అది ప్రేక్షకులను అమితంగా ఆశ్చర్యపరుస్తుందని ఆయన తెలిపారు. “ఏ హీరోయిన్‌కు కూడా దక్కని విధంగా ఒక అద్భుతమైన సీన్‌తో ఆమెను పరిచయం చేస్తున్నాం” అని ఆయన పేర్కొనడం విశేషం.

పాత్ర నేపథ్యం

ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఒక ఎమ్మెల్యే (MLA) కూతురి పాత్రలో కనిపించనున్నారు. ఆమె హోదాకు తగ్గట్టుగానే కాస్ట్యూమ్స్, లుక్ చాలా రిచ్‌గా, క్వాలిటీతో ఉంటాయని రత్నవేలు వివరించారు. విజయనగరం నేపథ్యంలోని సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి ఎలా ఉంటుందో, ఆమె ఆహార్యం కూడా అలాగే ఉంటుందని ఆయన తెలిపారు.

Advertisement

రామ్ చరణ్ పాత్ర చాలా మాస్‌గా, గ్రౌండెడ్‌గా ఉన్నప్పటికీ, జాన్వీ పాత్ర రిచ్‌గా ఉన్నా ఎక్కడా సినిమా మూడ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు రత్నవేలు తెలిపారు. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, పాత్ర స్వభావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆమె రూపాన్ని సహజంగా ఉంచారు. సినిమాటోగ్రఫీ పరంగా కూడా ఆమె పాత్రకు వాడిన లైటింగ్ కలర్ ప్యాలెట్ చాలా ఫ్రెష్‌గా ఉండబోతున్నాయని ఆయన హింట్ ఇచ్చారు.

Read also-మదర్స్ డే రోజున రోజా కూతురు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అది గిఫ్ట్ కాదు!

అంతే కాంకుండా ఈ చిత్రంలో వినోదానికి కూడా పెద్దపీట వేసినట్లు రత్నవేలు స్పష్టం చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయని, వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రతి పాత్రను చాలా లోతుగా రాసుకున్నారని, ఈ చిత్రం తర్వాత జాన్వీ కపూర్‌కు తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు రావడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనిని చూసిన నెటిజన్లు అయ్యో పాపం బుచ్చి బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×