E-Paper
Advertisement

iBomma: వీడు మామూలోడు కాదు భయ్యా.. ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు.. వందల కోట్లు సంపాదన?

iBomma: వీడు మామూలోడు కాదు భయ్యా.. ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు.. వందల కోట్లు సంపాదన?
Advertisement

iBomma: ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్ సృష్టికర్త ఇమ్మడి రవి అరెస్టు సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారిన ఈ పైరసీ వెబ్‌సైట్‌ వెనుక ఉన్న అసలు సూత్రధారిని పట్టుకోవడంతో.. అతని నేర చరిత్రకు సంబంధించిన అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రవి కరేబియన్ పౌరసత్వం తీసుకోవడం, విలాసవంతమైన జీవనం గడపడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇమ్మడి రవి 2022లో తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విచారణలో తేలింది. అదే సంవత్సరంలో అతను ఏకంగా రూ. 80 లక్షలు చెల్లించి కరేబియన్ పౌరసత్వాన్ని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి రవి కరేబియన్ దీవుల్లోనే ఉంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న తన ఆస్తులను అమ్ముకోవడానికి మూడు రోజుల క్రితం అతను దేశంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్, వైజాగ్‌లలో ఉన్న ఆస్తులను విక్రయించడానికి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: Satish Kumar Murder Case: సతీష్ కుమార్ హత్యపై డొంక కదిలింది.. గుట్టు అంతా ఫోన్ కాల్స్‌లో

సాంకేతిక పరిజ్ఞానం విషయంలో రవి దిట్ట. ఈ నైపుణ్యాన్ని ఉపయోగించే అతను ఐబొమ్మ వెబ్‌సైట్‌ను సృష్టించాడు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా అతను ఓటీటీ (OTT) కంటెంట్‌ను పైరసీకి గురిచేయడానికి ప్రత్యేక పద్ధతులను అనుసరించాడు. ముఖ్యంగా.. అతను డీఆర్‌ఎం (DRM – Digital Rights Management) టెక్నాలజీని హ్యాక్ చేసి, ఓటీటీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసేవాడు. అంతేకాకుండా.. మూవీ రూల్జ్ (MovieRulz) వంటి ఇతర పైరసీ వెబ్‌సైట్ల నుంచి కంటెంట్‌ను తీసుకుని.. దానిని హై-డెఫినిషన్ (HD) నాణ్యతలోకి మార్చి అప్‌లోడ్ చేసేవాడు. రవి కేవలం ఐబొమ్మతోనే ఆగకుండా.. మొత్తం 60 వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసి వాటి ద్వారా పైరసీ కంటెంట్‌ను పోస్టు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ మార్గాల ద్వారా అతను ఇప్పటి వరకు వందల కోట్లు సంపాదించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

Advertisement

రవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. 2022కు ముందు అతను ఒక ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు సమాచారం. టెక్నాలజీతో సంపాదించిన డబ్బులు, విదేశీ పౌరసత్వం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ అరెస్టుతో రవి పైరసీ సామ్రాజ్యం కుప్పకూలినట్లయింది. సినిమా పరిశ్రమకు తీరని నష్టం కలిగించిన ఈ వ్యవహారంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మున్ముందు ఇంకెన్ని సంచలన విషయాలు బయట పడుతాయో చూద్దా మరీ….

ALSO READ: Tragic Saudi Bus Accident: 45 మంది మృతి.. ఒకే కుటుంబంలో 18 మంది బలి.. మహేష్ కుమార్ గౌడ్ పరామర్శ

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×