Varanasi In Telugu Movies: తెలుగు సినిమాలకు కాశీతో లోతైన భావోద్వేగ సంబంధం కలిగి ఉంది. తెలుగు వాళ్ల మనసులో కాశీ ఒక ఆధ్యాత్మిక గమ్యం, జీవిత చక్రం ముగిసే స్థలంగా ముద్రపడిపోయింది. తెలుగు వారికి ఆ ప్రాంతంతో ఉన్న బలమైన సంబంధాన్ని చిత్ర పరిశ్రమ మరింత ఉన్నత స్థాయికి చేరుకునేలా చేసింది. తెలుగు చిత్రాల్లో కాశీ ఇతివృత్తాన్ని ఎంచుకునేలా చేసిందితెలుగు ప్రజలు తమ జీవిత కాలంలో ఒక్కసారి అయినా కాశీ యాత్ర చేయాలని భావిస్తారు. గతంతో ఎంతో మంది తమ జీవన చివరి మజిలీలో కాశీకి వెళ్లి కన్నుమూసేవారు. తెలుగు ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్షన్ ఉన్న ఈ ప్రాంతాన్ని తమ సినిమాల్లో అద్భుత క్షేత్రంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ప్రపంచానికి ఈ ప్రాంత అద్భుతాలను వివరించే ప్రయత్నిస్తున్నారు.
నాగ్ అశ్విన్ విజువల్ వండర్, మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’లో కాశీ ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. కాశీని చివరి మానవ నగరంగా ఇందులో చూపిస్తారు. ఎందుకంటే, పురాణాల ప్రకారం.. ప్రళయం వచ్చి ప్రపంచం అంతా నాశనం అయినా ఈ నగరం చెక్కు చెదరని చెప్పడబడింది. ఇక రాజమౌళి, మహేష్ కాంబోలో రాబోతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’ పూర్తిగా కాశీ చుట్టూ తిరుగుతుంది. టైమ్ ట్రావెల్, హిందూ మైథాలజీ కేంద్రంగా ఈ సినిమా రూపొందబోతోంది. తెలుగు సినిమాలకు కాశీ కేవలం లొకేషన్ కాదు. అది భక్తి, మోక్షం, జీవితాంతం, ఎమోషనల్ క్లైమాక్స్కి సింబల్ అని ఈ సినిమా నిరూపించబోతోంది. ఇదే లింక్ తో ‘కల్కి 2898 AD’లో కాశీని చివరి నగరంగా, రాజమౌళి చిత్రంలో సెంట్రల్ స్టేజ్‌గా చూపించగలుగుతున్నారు. ఎందుకంటే. కాశీకి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న స్థానం అలాంటిది.
జక్కన్న రాజమౌళి ఇప్పుడు ‘వారణాసి’ నగరాన్ని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేయబోతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ చేయని అంశాన్ని వెండితెర మీద అవిష్కరించబోతున్నారు. టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్, హిందూ మైథాలజీ మిక్స్ చేస్తూ.. కాశీని 512 CE నుంచి 7200 BC వరకు చూపించబోతున్నారు. సెంట్రల్ సెట్టింగ్, ఘాట్లు, టెంపుల్స్, యాగాలు, యుద్ధాలు, రుద్ర పాత్రలో మహేష్ బాబు నంది మీద దూసుకొచ్చే విజువల్స్ తో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. నాటి ‘కల్కి 2898 AD’ అయినా, నేటి ‘వారణాసి’ అయినా కాశీ నగరాన్ని ప్రపంచం ముందు సరికొత్త యాంగిల్ లో ప్రజెంట్ చేశాయి. చేయబోతున్నాయి.
హిందూ పురాణాల ప్రకారం.. ముఖ్యంగా స్కంద పురాణంలోని కాశీని ఓ ఖండంగా అభివర్ణిస్తారు. వారణాసి సాధారణ భూగోళంలో భాగం కాదని ఇందులో రాసి ఉంటుంది. సృష్టిలో మొదటి నగరం మాత్రమే కాదు..చివరి నగరం కూడా కాశీనే. శివుడి త్రిశూలం కొన మీద ఈ కాశీ నగరం ఉంటుంది. ప్రళయ సమయంలో విశ్వం మొత్తం కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ, కాశీ ఎప్పటికీ నాశనం కాదు. “కాశీ నా అత్యున్నత నివాసం. అది ఎప్పటికీ అంతం కాదు” అని శివుడు స్వయంగా ప్రకటించినట్లు స్కంద పురాణం చెప్తుంది. శివుడు కాశీలో భౌతికంగా విశ్వనాథుడిగా నివసిస్తున్నాడని భావిస్తారు పండితులు. శివుడు ఇతర ప్రదేశాలను సందర్శంచినప్పటికీ, కాశీని ఎప్పుడూ విడిచి పెట్టడని నమ్ముతారు. “కాశ్యం మరణాం ముక్తిః” అనే వాక్యాన్ని ప్రజలకు ఇప్పటికీ నమ్ముతారు. కాశీలో మరణించడం వల్ల వెంటనే మోక్షం లభిస్తుందని భావిస్తారు. ఎందుకంటే శివుడు స్వయంగా మరణిస్తున్న వ్యక్తి చెవిలో తారక మంత్రాన్ని జపించి వారి కర్మలన్నింటినీ దహిస్తాడని విశ్వసిస్తారు.శివుడు పార్వతిని వివాహం చేసుకున్న తర్వాత తన శాశ్వత నివాసంగా కాశీని ఎంచుకున్నాడు. ఈ నగరాన్ని శివుడు పార్వతికి ఇచ్చిన వివాహ బహుమతిగా పరిగణిస్తారు.
దేశ వ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ శివుడు అనంతమైన కాంతి స్తంభంగా కనిపించినట్లు పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మ, విష్ణువు ఎవరు ఉన్నతమైనవారో అని వాదించుకున్నప్పుడు.. శివుడు అంతులేని కాంతి స్తంభంగా కనిపించాడని ప్రస్తావిస్తాయి. కాశీలో మొదట కాంతి వ్యక్తమై.. శివుడి ఆధిపత్యాన్ని రుజువు చేసినట్లు పండితులు చెప్తారు.
గంగా స్వర్గం నుంచి దిగివచ్చినప్పుడు, శివుడు గంగోత్రి దగ్గర తన జడల మీద ఆమెను బంధించాడు. కానీ, కాశీలో, గంగ ఉత్తరం వైపుకు అంటే శివుడి వైపు ప్రవహిస్తుంది. ఇది అరుదైన, శుభకరమైన దృగ్విషయంగా భావిస్తారు. శివుడు, కాశీ కలయికను పవిత్రమైన త్రివేణి (శరీరం, మనస్సు, ఆత్మ సంగమం)గా పరిగణిస్తారు.శివుడిని కాశీకి అధిపతిగా భావిస్తారు. వారణాసిలోని పంచక్రోషి సరిహద్దులో మరణించే ఎవరైనా, వారి గత పాపాలతో సంబంధం లేకుండా విముక్తి పొందేలా చేస్తాడని నమ్ముతారు. ఇంతటి మహత్తరమైనది కాబట్టే, వారణాసి నగరాన్ని తెలుగు సినిమా తలకెత్తుకుంటుంది.
Read Also: ఐబొమ్మ రవి.. హీరోనా? విలనా?