Shahrukh Khan: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ రీ రిలీజ్ చిత్రాలకి నాంది వేసింది మాత్రం మహేష్ బాబు (Mahesh Babu)అభిమానులని చెప్పవచ్చు. ఆయన సినిమాలు విడుదలకు సిద్ధం లేకపోవడంతో నిరాశ చెందిన అభిమానులు.. ఆయన కెరియర్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు ఈ చిత్రాలను 4K లో విడుదల చేస్తూ అటు నిర్మాతలు కూడా లాభపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే హీరోలకు సంబంధించిన స్పెషల్ అకేషన్ ఏదైనా ఉందంటే చాలు ఖచ్చితంగా వారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు.
అయితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) చిత్రాలు కూడా రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 బ్లాక్ మాస్టర్ చిత్రాలు రీ రిలీజ్ కి సిద్ధం అవుతుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. మరి షారుఖ్ ఖాన్ బర్త్ డే రోజున ఏ ఏ చిత్రాలు రీ రిలీజ్ కాబోతున్నాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం.. విషయంలోకి వెళ్తే నవంబర్ ర2వ తేదీన షారుఖ్ ఖాన్ తన 60వ పుట్టినరోజున జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఆయనకు ప్రత్యేకంగా ఏదైనా బహుమతి ఇవ్వాలి అని సిద్ధమయ్యారు. అందులో భాగంగానే “షారుఖ్ ఖాన్ ఫిలిం ఫెస్టివల్ ” పేరుతో ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలను అక్టోబర్ 31 నుంచి థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు.
ALSO READ:Janhvi Kapoor: పురుషాహంకారంపై జాన్వీ కామెంట్స్.. తనకు కూడా తప్పలేదన్న ట్వింకిల్!
ఈ ఫిలిం ఫెస్టివల్ లో దిల్ సే, దేవదాస్, ఓంశాంతి ఓం చిత్రాలతో పాటు మై హూనా , చెన్నై ఎక్స్ప్రెస్ వంటి ఐకానిక్ సినిమాలు కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ” ఈ సినిమాలలోని నా పాత్రలు ఇప్పటికీ కూడా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. నేను మారలేదు.. కేవలం జుట్టు మాత్రమే కొంచెం స్టైలిష్ గా మారింది. ఈ ఫెస్టివల్ ద్వారా అభిమానులతో మళ్ళీ ఆ బంధాన్ని పెంచుకోవడానికి నేను సిద్ధం అయ్యాను” అంటూ షారుక్ ఖాన్ తెలిపారు. ఇకపోతే ఈ ఫిలిం ఫెస్టివల్ లో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు ఇండియాలోని పివిఆర్ ఐనాక్స్ థియేటర్లలో అలాగే ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, యూకే , యూరప్, న్యూజిలాండ్ వంటి దేశాలలో యష్ రాజ్ ఫిలిమ్స్ సహకారంతో ఈ చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కింగ్ అనే సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తో షారుక్ కుమార్తె సుహానా ఖాన్ బాలీవుడ్లో నటిగా అరంగేట్రం చేస్తోంది. ఇందులో షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.