Krithi Shetty: కన్నడ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న కృతి శెట్టి (Krithi Shetty).. డైరెక్టర్ సుకుమార్ (Sukumar)శిష్యుడిగా పేరు సొంతం చేసుకున్న బుచ్చి బాబు సన(Bucchibabu sana) దర్శకుడిగా తొలి ప్రయోగంలో చేసిన ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) కూడా హీరోగా నటించారు. ఇద్దరికీ ఇది తొలి చిత్రం.. పైగా మొదటి సినిమాతోనే 100కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించారు. ఈ సినిమా తర్వాత కృతి శెట్టి శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకుంది. ఆ తర్వాత ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఇలా పలు చిత్రాలలో నటించింది.కానీ ఏవీ కూడా ఈమె కెరియర్ కు సక్సెస్ అందివ్వలేదు.
ఇదిలా ఉండగా ఇప్పుడు బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నటుడు గోవిందా కుమారుడు యశ్వర్థన్ అహుజా హీరోగా రాబోతున్న చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంతోనే కృతి శెట్టి బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తోందని బాలీవుడ్ వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దక్షిణాదిలో హిట్ అందుకున్న ఒక చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తీయబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కృతి శెట్టికి.. ఈ బాలీవుడ్ మూవీ అయినా మంచి కం బ్యాక్ ఇస్తుందేమో చూడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.
ALSO READ:Samantha: కోలీవుడ్ కి పయనమవుతున్న సమంత.. ఆ స్టార్ హీరోతో జతకట్టనుందా?
ఇకపోతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఈమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఇతర భాష ఇండస్ట్రీలలో నటించడానికి వెళ్తే.. రీమేక్ సినిమా చేయడానికి వెళ్తారా? లేక స్ట్రైట్ మూవీ చేయడానికి వెళ్తారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు అంతేకాదు రీమేక్ మూవీ చేయడానికి బాలీవుడ్ వరకు వెళ్లాలా? అంటూ కూడా కౌంటర్ వేస్తున్నారు. మరి దీనిపై కృతి శెట్టి ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఏది ఏమైనా రీమేక్ మూవీ అయినా సరే ఈమె కెరియర్ కు ప్లస్ అయితే మాత్రం నిజంగా బాలీవుడ్లో మళ్లీ చక్రం తిప్పుతుంది అని అభిమానులు మద్దతు పలుకుతున్నారు.
కృతి శెట్టి కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తో కలిసి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మరొకవైపు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు ఇలా బాలీవుడ్ కి పయనం అవుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ దీనిపై.. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే. సౌత్ లో అడపాదడపా అవకాశాలు అందుకుంటున్న ఈమెకు బాలీవుడ్ పరిశ్రమ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.