BigTV English

Kantara Chapter 1 : కాంతార2లో తెగ నాయకుడితో రిషబ్ శెట్టికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

Kantara Chapter 1 : కాంతార2లో తెగ నాయకుడితో రిషబ్ శెట్టికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

Kantara Chapter 1 : కాంతార.. ఆధ్యాత్మిక కథాంశంతో 2022లో తెరకెక్కిన కన్నడ ప్రాంతీయ చిత్రం ఇది. కన్నడలో ఊహించని పాపులారిటీ అందుకున్న ఈ సినిమా.. వివిధ భాషలలో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా వైడ్ గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చేశారు. సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అంటూ అక్టోబర్ 2వ తేదీన దసరా సందర్భంగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు రిషబ్ శెట్టి (Rishabh Shetty). స్వీయ దర్శకత్వంలో రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే 89 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లో చేరిపోయింది.


కాంతార చాప్టర్ 1 లో రిషబ్ శెట్టి స్నేహితుడు..

ఇకపోతే ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే నిన్నటి వరకు ఈ సినిమాలో రిషబ్ శెట్టి భార్య, పిల్లలు కూడా నటించారు అన్న విషయం బయటకు రాగా.. ఇప్పుడు రిషబ్ శెట్టి స్నేహితుడు కూడా ఇందులో నటించారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఆయన ఎవరు అనే విషయంలోకి వెళ్తే.. రిషబ్ శెట్టి తాజాగా దర్శకత్వం వహించి, నటించిన కాంతారా చాప్టర్ 1 చిత్రంలో కీలకపాత్ర పోషించారు సంపత్ రామ్. ఇందులో ఒక తెగ నాయకుడు పాత్రలో కనిపించి, తన భయంకరమైన లుక్, యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపత్ రామ్ మాట్లాడుతూ రిషబ్ శెట్టి తో తనకున్న బంధాన్ని చెప్పుకొచ్చారు.

17 ఏళ్ల స్నేహబంధం అంటున్న సంపత్ రామ్..

సంపత్ రామ్ మాట్లాడుతూ.. “అట్టహాస, సినాద్ వంటి చిత్రాలకి రిషబ్ శెట్టి ని అసిస్టెంట్ డైరెక్టర్గా చూశాను. అప్పటినుంచి రిషబ్ నన్ను మాస్టర్.. మాస్టర్.. అని పిలుస్తాడు. రిషబ్ శెట్టి ‘బెల్ బాటమ్’ చిత్రంలో హీరోగా నటించినప్పుడు చాలా సంతోషించాను. కాంతార 1 ఫస్ట్ లుక్ చూసి మీ సినిమాలో నాకు కూడా అవకాశం ఇవ్వండి అని నేను అతనికి మెసేజ్ పంపితే.. రెండు వారాల్లోనే నాకు ఫోన్ చేసి నువ్వు మా సినిమాలో పనిచేస్తావా? అని అడిగారు. గిరిజన నాయకుడు పాత్రకు మేకప్ వేయడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. ఈ పాత్రలో నటించడం నాకు మరింత సంతోషంగా ఉంది” అంటూ సంపత్ రామ్ తెలిపారు. ఇకపోతే వీరి మధ్య స్నేహం దాదాపు 17 సంవత్సరాలుగా ఉందట . రిషబ్ శెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడే సంపత్ రామ్ తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ స్నేహితులుగా కొనసాగుతున్నట్లు సంపత్ తెలిపారు.


ALSO READ:Krithi Shetty: రీమేక్ చేయడానికి బాలీవుడ్ కి వెళ్లాలా.. కృతి కొత్త మూవీపై విమర్శలు!

సంపత్ రామ్ కెరియర్..

సంపత్ రామ్ కెరియర్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం భాషల్లో నటించిన ఈయన.. తెలుగులో సలార్, కన్నప్ప, డాకు మహారాజ్ , నారప్ప వంటి చిత్రాలలో నటించారు. అలాగే విక్రమ్, తంగలాన్ వంటి తమిళ్ చిత్రాలలో కూడా నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఒక తమిళంలోనే సుమారుగా 80 కి పైగా చిత్రాలలో కనిపించారు.

Related News

Bahubali Epic: బాహుబలి ఎపిక్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న రాజమౌళి

ARI Trailer : సైకో మైథలాజికల్ థ్రిల్లర్ స్టోరీగా ‘అరి’.. కోరికలు తీర్చబడును..మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టు..

Vyjayanthi Movies: యాక్షన్ అడ్వెంచర్ కాదు లేడీ ఓరియంటెడ్.. భలే ప్లాన్ చేస్తున్నారే?

Shrikanth Bharat: వాడు మహాత్ముడా.. 15 ఏళ్ల అమ్మాయిని నగ్నంగా పడుకోబెట్టి…

Krithi Shetty: రీమేక్ చేయడానికి బాలీవుడ్ కి వెళ్లాలా.. కృతి కొత్త మూవీపై విమర్శలు!

Samantha: కోలీవుడ్ కి పయనమవుతున్న సమంత.. ఆ స్టార్ హీరోతో జతకట్టనుందా?

Arasan: వెట్రిమారన్- శింబు టైటిల్ తెలిసిపోయిందోచ్..

Big Stories

×