Shrikanth Bharat: టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా, సపోర్టివ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునుసంపాదించుకున్నాడు. నటనలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు. కానీ, బయట మాత్రం వివాదాలు లేనిదే ముద్దా దిగదు అనేలా ఉంటాడు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే శ్రీకాంత్ ఏ విషయంలో అయినా తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా చెప్పుకొస్తాడు.
ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం జరిగినా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో శ్రీకాంత్ ఎన్నోసార్లు వివాదాలను కొనితెచ్చుకున్నాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. తాజాగా మహాత్మా గాంధీ గురించి ఈ నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున మహాత్మా గాంధీ గురించి చాలా నీచంగా మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
తాజాగా ఆ వైరల్ వీడియో గురించి మరోసారి శ్రీకాంత్ మాట్లాడాడు. ఎవరు ఎన్ని విమర్శించినా తాను పట్టించుకోనని, తన మనసుకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతానని చెప్పుకొచ్చాడు. ఇక స్వాతంత్య్రం తీసుకొచ్చింది మహాత్ముడు కాదని, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అని చెప్పుకొచ్చాడు. మహాత్ముడు ఎంతోమంది ఆడవారిని లైంగికంగా వేధించినట్లు తెలిపాడు.
” నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్స్ వస్తున్నాయి. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ, మొన్న అక్టోబర్ 2 గురించి పోస్ట్ పెడితే కొందరు అది ఇది అని బూతులు తిట్టారు. ఏం తెలుసు మీకు వాడి గురించి. 15, 16 ఏళ్ల అమ్మాయిని నగ్నంగా పడుకోబెట్టి.. నిగ్రహంగా ఉన్నానా లేదా అని చూసుకున్నాడు.. ఎంతోమందిని లైంగికంగా వేధించినవాడు మహాత్ముడా..స్వాతంత్య్రం గాంధీ తీసుకురాలేదు. చంద్రబోస్, భగత్ సింగ్ .. లక్షలమంది తీసుకొచ్చారు. వాళ్లు పరమాత్ములు. జాతి పిత అంటున్నారు.. కాదు. భరతమాత అనే వ్యక్తులం మేము. జాతిపిత అంట. ఒకవేళ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జాతిపిత అయితే నేను ఒక బాస్టర్డ్ సిటిజెన్ ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. శ్రీకాంత్ వ్యాఖ్యలపై కొందరు మండిపడుతుంటే మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.
Dare to WATCH?!?!?!
THE TRUTH!!!!!!! pic.twitter.com/0Y0kO2cvDP
— Shrikanth BHARAT (@Shri__Bharat) October 6, 2025