BigTV English

Manoj Tiwary: కోహ్లీ, రోహిత్ ఉంటే ప్ర‌శ్నిస్తారు..అందుకే వాళ్ల గొంతు గంభీర్ నొక్కేశాడు

Manoj Tiwary: కోహ్లీ, రోహిత్ ఉంటే ప్ర‌శ్నిస్తారు..అందుకే వాళ్ల గొంతు గంభీర్ నొక్కేశాడు

Manoj Tiwary: రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగించడం అలాగే విరాట్ కోహ్లీ లాంటి వాళ్లను పక్కకు పెట్టడంపై గంభీర్ కుట్రలు పన్నుతున్నాడని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. దీంతో గౌతమ్ గంభీర్ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు. అలాగే ఆయన వల్ల టీమ్ ఇండియా నాశనం అవుతుందని కూడా కొంతమంది వాపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉంటే గౌతమ్ గంభీర్ ఆటలు సాగబోవని, అందుకే వాళ్ళందరినీ బయటకి పంపిస్తున్నాడని బాంబు పేల్చారు మనోజ్ తివారి. దీంతో మనోజ్ తివారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.


Also Read: Tazmin Brits: ఒకే ఏడాది 5 సెంచరీల‌తో రికార్డు…రాముడి అవ‌తారం ఎత్తిన సౌతాఫ్రికా లేడీ..అచ్చం కోహ్లీ లాగే

ప్రశ్నిస్తారని గొంతు నొక్కేస్తున్నాడు, గంభీర్ పై సీరియస్

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ నేపథ్యంలో జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో రోహిత్ శర్మ అలాగే కోహ్లీ సాధారణ ప్లేయర్లుగా రాబోతున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీని, పీకి పడేసి గిల్ కు అప్పగించారు. అయితే ఈ నిర్ణయం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇలాంటి నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ మనోజ్ తివారి కూడా స్పందించారు. గౌతమ్ గంభీర్ వచ్చాక టీమిండియాలో కాంట్రవర్సీలు ఎక్కువ అయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమిండియా ఎన్విరాన్మెంట్ ను మొత్తం దెబ్బతీస్తున్నాడని బాంబు పేల్చారు. గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి చాలా వివాదాలు జరుగుతున్నాయని కూడా మనోజ్ తివారి చెప్పే ప్రయత్నం చేశారు.

ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసిన టీమిండియా జట్టులో లేనివారు, సడన్ గా ప్లేయింగ్ 11 లో ఆడుతున్నారని హర్షిత్ రాణాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అశ్విన్, రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు ఉంటే, హెడ్ కోచ్ గంభీర్ నిర్ణయాలను కచ్చితంగా ప్రశ్నిస్తారు. అందుకే వాళ్లను ఇప్పుడు సైడ్ లైన్ చేశారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు మనోజ్ తివారి. మొదట అశ్విన్, కోహ్లీని సైడ్ చేసి, ఇప్పుడు రోహిత్ శర్మాను కూడా బయటకు పంపించే కుట్ర పన్నినట్లు బాంబు పేల్చారు. ఇది ఇలాగే కొనసాగితే టీమిండియా సర్వనాశనం కావడం గ్యారెంటీ అన్న రేంజ్ లో ఆయన వ్యాఖ్యానించారు.

గౌతమ్ గంభీర్ పెద్ద కొడుకు హర్షిత్ రాణా అంటూ ట్రోలింగ్

టీమిండియాలో హర్షిత రాణా ప్లేస్ అనేది పర్మినెంట్ అయిపోయింది. దీంతో అతన్ని పర్మినెంట్ ప్లేయర్ గా పిలుస్తున్నారు. కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హర్షిత్ రాణాను ప్రతి ఫార్మాట్ లో గౌతమ్ గంభీర్ సెలెక్ట్ చేస్తున్నారు. టెస్టుల్లో కూడా అతను ఆడుతున్నాడు. ఇటు టి20 లో అలాగే వన్డేలకు కూడా సెలెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఆడినా అతని పర్ఫామెన్స్ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. అతనికోసం మహమ్మద్ షమీ అలాగే మహమ్మద్ సిరాజు లాంటి ప్లేయర్లను పక్కకు పెడుతున్నారు. దీంతో గౌతమ్ గంభీర్ పెద్దకొడుకు హర్షిత్ రాణా అంటూ సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Also Read:  India Schedule: 2026 వ‌ర‌కు వ‌రుస‌గా మ్యాచ్ లే…ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ కూడా లేదు..టీమిండియా కొత్త షెడ్యూల్ ఇదే

Related News

Rohit Sharma Captaincy: డిప్రెష‌న్ లో రోహిత్ శ‌ర్మ‌..షాకింగ్ వీడియో వైర‌ల్‌

AB de Villiers: కోహ్లీ, రోహిత్‌పై గ్యారెంటీ లేదు..ఇక రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెట‌ర్ !

Gautam Gambhir: గంభీర్ మ‌హాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మ‌రీ !

Inzamam-ul-Haq: రోహిత్ శ‌ర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !

Womens World Cup 2025: నేడు ఇంగ్లాండ్ తో బంగ్లా ఫైట్‌..పాయింట్ల ప‌ట్టిక ఇదే, చిట్ట‌చివ‌ర‌న పాకిస్థాన్‌

IND VS AUS: టీమిండియాతో సిరీస్.. కమిన్స్ లేకుండా ఆసీస్‌..జ‌ట్ల వివ‌రాలు ఇవే

MS Dhoni: రోహిత్‌, కోహ్లీని గెంటేశారు..కానీ ధోనిని ఎవ‌డు కూడా ట‌చ్ చేయ‌లేదు..కార‌ణం ఇదే

Big Stories

×