Samantha: ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ అంటూ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే 2017లో తాను ప్రేమించిన అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya)ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విడాకుల తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడ్డ సమంత.. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అంతేకాదు కొంతకాలం ఇండస్ట్రీకి కూడా దూరమైంది.
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతున్న ఈమె.. తాజాగా తెలుగులో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాను అంటూ ఇటీవల స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ ఓ బేబీ’ సినిమాతో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ నందిని రెడ్డి (Nandini Reddy) డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు అటు బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే (Raj & DK) దర్శకత్వంలో ‘రక్త బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. కానీ ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇప్పుడు కోలీవుడ్ కి పయనం అవుతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విషయం తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి సమంత చేయబోతున్న ఆ కోలీవుడ్ మూవీ ఏంటో ఇప్పుడు చూద్దాం.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత ప్రముఖ హీరో శింబు (Simbu) తో జతకట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వెట్రిమారన్ (Vetrimaran) దర్శకత్వంలో శింబు హీరోగా త్వరలో ఒక కొత్త సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించారట. అందులో భాగంగానే చిత్ర బృందం ఆమెను సంప్రదించి కథను వినిపించగా.. ఆమె కూడా కథ నచ్చి ఓకే చెప్పిందని.. త్వరలోనే దీనిపై అధికారికంగా అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టును దర్శకుడు వెట్రిమోరన్ ఇటీవల ధనుష్ (Dhanush) తో తీసిన సూపర్ హిట్ చిత్రం ‘వడ చెన్నై’ యూనివర్స్ లో భాగంగా రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ యూనివర్స్ లో మరిన్ని చిత్రాలు రానున్నాయని సమాచారం. ఏది ఏమైనా కోలీవుడ్లో సినిమా చేయడానికి సమంత సిద్ధమైంది తెలియడంతో తమిళ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో చట్టపట్టలేసుకొని తిరగడంతో చాలా ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటోంది ఈ ముద్దుగుమ్మ. అతడిని పెళ్లి కూడా చేసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇలా రూమర్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వేళ వీటిపై సమంత స్పందించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సమంత స్పందించి ఈ రూమర్స్ కి చెక్ పెట్టాలి అని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
ALSO READ:Bigg Boss 9 Promo : వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ… హౌస్‌మేట్స్ బెండ్ తీస్తున్న బిగ్ బాస్!