Vyjayanthi Movies: ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో అన్ని జానర్ లలో సినిమాలు చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే హారర్, యాక్షన్, అడ్వెంచర్ ,రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా స్పోర్ట్స్ , లేడీ ఓరియంటెడ్ ఇలా పలు జానర్ లలో సినిమాలు రావాలి అని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయా జానర్లలో మంచి కథ బలంతో సినిమాలు వస్తే ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా దర్శకులు హీరోలే కాదు నిర్మాతలు కూడా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా నిర్మాణ సంస్థగా పేరు సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఈసారి యాక్షన్ అడ్వెంచర్ కాకుండా ఏకంగా లేడీ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
అసలు విషయంలోకి వెళ్లి.. సీనియర్ ఎన్టీఆర్ ని మొదలుకొని నేడు యంగ్ హీరోల వరకు అందరితో సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వైజయంతి మూవీస్ మేకర్స్ ఇటీవల ‘కల్కి 2898AD’ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్ ఒకవైపు కల్కి 2 సీక్వెల్ కోసం సన్నహాలు సిద్ధం చేసుకుంటున్న వేళ.. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈసారి లేడీ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు సమాచారం.
ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వైజయంతి మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి “చుక్కలు తెమ్మన్నా… తెంచుకురానా” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. అంతేకాదు ఒక డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల (Sree Leela) లేదా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చెయ్యబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మంచి కథ ఓరియంటెడ్ తో ప్రేక్షకులను అలరించే వైజయంతి మూవీస్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి..
ALSO READ:Kantara Chapter 1 : కాంతార2లో తెగ నాయకుడితో రిషబ్ శెట్టికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?
వైజయంతి మూవీస్ బ్యానర్ విషయానికి వస్తే.. 1975లో సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) హీరోగా ‘ఎదురులేని మనిషి’ సినిమాతో ఈ బ్యానర్ ప్రారంభించబడింది. చలసాని అశ్వినీ దత్ (C.Ashwini Dutt) నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యానర్ పై యుగ పురుషుడు, అడవి సింహాలు, అగ్నిపర్వతం, బ్రహ్మ రుద్రుడు, జగన్మాత, ఆఖరిపోరాటం, జగదేకవీరుడు అతిలోకసుందరి, అశ్వమేధం, రావోయి చందమామ, రాజకుమారుడు, ఆజాద్, స్టూడెంట్ నెంబర్ వన్, కంపెనీ, జై చిరంజీవ, సైనికుడు, చిరుత, కంత్రి, శక్తి మహానటి దేవదాస్ ఇలా ఎన్నో చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. కల్కి సినిమా రాకముందు వరకు వైజయంతి మూవీస్ పని అయిపోయింది. ఇక బుట్ట సర్దే టైం వచ్చిందని కొంతమంది కామెంట్లు చేయగా.. కల్కి సినిమాతో గట్టి కం బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మంచి లేడీ ఓరియెంటెడ్ మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు.