BigTV English

Bahubali Epic: బాహుబలి ఎపిక్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న రాజమౌళి

Bahubali Epic: బాహుబలి ఎపిక్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న రాజమౌళి

Bahubali Epic: ఈ మధ్యకాలంలో కొత్త సినిమాల కన్నా రీరిలీజ్ సినిమాలే ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇప్పటి టెక్నాలజీని వాడుకొని అప్పటి సినిమాలను మరోసారి అభిమానులకు సరికొత్తగా చూపిస్తున్నారు మేకర్స్. ప్రేక్షకులు సైతం ఆ పాత సినిమాలనే సరికొత్తగా చూడడానికి ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని సినిమాలు రీ రిలీజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇంకొన్ని బోల్తా పడుతున్నాయి.


ఇక ఎప్పటి నుంచో ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న రీ రిలీజ్ బాహుబలి ఎపిక్. దీనికి ఒక స్పెషల్ ఉంది. సాధారణంగా సినిమా సినిమా లెంత్ పెద్దది అయితే రెండు పార్ట్స్ గా విడదీస్తారు. కానీ, బాహుబలి ఎపిక్ లో రెండు పార్ట్ లను కలిపి ఇంకో కొత్త సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. అది కూడా కొత్త కంటెంట్ ను యాడ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాలు రిలీజ్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెల్సిందే. ఇక బాహుబలి రీరిలీజ్ కూడా ప్రమోషన్స్ ఆ రేంజ్ లోనే ప్లాన్ చేశాడు జక్కన్న.

బాహుబలి ఎపిక్ అక్టోబర్ 31 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో నిర్మాత శోభు యార్లగడ్డ.. ఈ సినిమాపై హైప్ ఇంకా పెంచాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. బాహుబలి ఎపిక్ చివర్లో జక్కన్న ఒక పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న  విషయం విదితమే. అయితే అది.. బాహుబలి 3 అనౌన్స్ మెంట్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయమై శోభు యార్లగడ్డ కూడా స్పందించాడు.


బాహుబలి చివర్లో సర్ ప్రైజ్ గా బాహుబలి 3 ని ప్రకటించే ఛాన్స్ ఉందా.. ? అన్న ప్రశ్నకు శోభు యార్లగడ్డ మాట్లాడుతూ..  బాహుబలి 3 అయితే లేదు కానీ, కొత్త సర్ ప్రైజ్ ఉంది. బాహుబలి 3 కి ఇంకా టైమ్ ఉంది. దానికి చాలా వర్క్ చేయాలి. ఈ ఎపిక్ లో బాహుబలి ఫేజ్ 2 చూస్తారు అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ఆ  కొత్త సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మరి బాహుబలి ఎపిక్ ఎండింగ్ లో జక్కన్న ఎలాంటి సర్ ప్రైజ్ ఇచ్చాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Related News

Mithra Mandali Trailer:మహిళా మండలితో అంతరించిపోతున్న మిత్రమండలి.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ వీడియో!

ARI Trailer : సైకో మైథలాజికల్ థ్రిల్లర్ స్టోరీగా ‘అరి’.. కోరికలు తీర్చబడును..మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టు..

Vyjayanthi Movies: యాక్షన్ అడ్వెంచర్ కాదు లేడీ ఓరియంటెడ్.. భలే ప్లాన్ చేస్తున్నారే?

Kantara Chapter 1 : కాంతార2లో తెగ నాయకుడితో రిషబ్ శెట్టికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

Shrikanth Bharat: వాడు మహాత్ముడా.. 15 ఏళ్ల అమ్మాయిని నగ్నంగా పడుకోబెట్టి…

Krithi Shetty: రీమేక్ చేయడానికి బాలీవుడ్ కి వెళ్లాలా.. కృతి కొత్త మూవీపై విమర్శలు!

Samantha: కోలీవుడ్ కి పయనమవుతున్న సమంత.. ఆ స్టార్ హీరోతో జతకట్టనుందా?

Big Stories

×