ARI Trailer : ఒకప్పుడు భారీ యాక్షన్ సన్నివేశాలున్నా చిత్రాలను చూసేందుకు యువత ఎక్కువగా ఆసక్తి కనపరిచేవారు. ఈమధ్య దేవుళ్ళపై వస్తున్న స్టోరీ ల సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి స్టోరీలతో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి కూడా. ఇప్పుడు అలాంటి స్టోరీ తోనే మరో సినిమా రాబోతుంది. దేవుడు ఎప్పుడు ఆయన లీలలు చూపిస్తారో అంటూ అద్భుతమైన స్టోరీ తో అరి మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుల్లితెర లెజెండరీ యాంకర్, యాక్టర్ అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తుంది. సాయికుమార్ కూడా ప్రధాన పాత్ర చేస్తున్నాడు. మనిషిలోని ఎమోషన్స్, కోరికలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీసినట్టు తెలుస్తోంది..ఏడేళ్ల క్రితమే పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ వివిధ కారణాలతో వాయిదా పడింది. ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దేవుడి గురించి చెప్పిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈమధ్య దేవుడి పురాణాల గురించి వచ్చిన సినిమాలో ప్రేక్షకులను బాగా కట్టుకుంటున్నాయి. మొన్న వచ్చిన మహావతార్ నరసింహ నుంచి నిన్న వచ్చిన కాంతారా 2 వరకు భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాంటి స్టోరీతోనే అరి మూవీ రాబోతుందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. భూలోకంలో జన్మించాలన్న శ్రీకృష్ణుని సంకల్పం తెలుసుకున్న స్వర్గంలో ఆరుగురు దేవతలు తమను కూడా భూలోకం తీసుకెళ్లమని శ్రీకృష్ణుని వేడుకున్నారు. అవే అరిషడ్వర్గాలు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు.. అనే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత లైబ్రరీలో ఇక్కడ అన్ని రకాల కోరికలు తీర్చబడును అని ఉంటుంది. తమ కోరికల గురించి తెలుసుకోవాలనుకున్న ఏడుగురు గురించి ఈ ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరందరిపైనే స్టోరీ ఉంటుందని ఆ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి ఈ ట్రైలర్ వీడియో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Also Read : రీతూ లవ్ స్టోరీ పై మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్.. నెక్స్ట్ ఎలిమినేట్ ఆమె..?
గతంలో మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న పేపర్ బాయ్ మూవీ డైరెక్టర్ జయశంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ను ఆయన ఎంచుకున్నారు. అరిషడ్వర్గాల అంశానికి మైథలాజికల్ టచ్ ఇస్తూ మూవీని తెరకెక్కించారు. ‘అరి’ అంటే శత్రువు అని అర్థం.. ఈ మూవీ కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఈ నెల 10న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనసూయతో పాటు సీనియర్ హీరో సాయికుమార్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, వాసు ఇంటూరి తదితరులు కీలక పాత్రలు పోషించారు..