Delhi News: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన జరిగింది. పార్టీ పేరుతో హోటల్‌కు వెళ్లింది 18 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థిని. ఆ తర్వాత ఆమెని లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఫోటోలు, వీడియోలు చూపించి నెల రోజులపాటు ఆమెని బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఢిల్లీలో దారుణం
పోలీసులు చెప్పిన వివరాల మేరకు హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఢిల్లీలో ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ ఎంబీబీఎస్ చదువుతోంది. యువతి ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఉంది. అతడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఢిల్లీకి రాకముందు నుంచి వీరిద్దరికీ పరిచయం ఉంది. సెప్టెంబర్ 9న స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని యువతిని నమ్మించాడు.
ఆ తర్వాత హోటల్ ఆపిల్‌కు రప్పించాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వడంతో తాగిన యువతి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. తన చిత్రాలు, వీడియోలను చిత్రీకరించి బెదిరించడం మొదలుపెట్టారు. ఆ విధంగా పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలి అందులో ప్రస్తావించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హోటల్‌కి రప్పించి, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్
ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ ఘటన నార్త్‌వెస్ట్ ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌లో చోటు చేసుకుంది. చివరికి బాధిత యువతి తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపింది. వారి సాయంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాధిత మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సివుంది.
ALSO READ: పెళ్లయిన నెలరొజులకే ప్రేమ జంట మధ్య
ఆగస్టులో జరిగిన సామూహిక అత్యాచారం ఆరోపణలతో సహా ఇటీవలకాలంలో సిటీలో ఇలాంటి హై ప్రొఫైల్ లైంగిక హింస కేసులు నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ-ప్రైవేట్ ప్రదేశాలలో మహిళల భద్రత గురించి కొత్త చర్చలకు దారితీసింది.