పండుగ సీజన్ వేళ ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సీజన్ కోసం మొత్తం 12 వేల ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగానే రెండు ప్రత్యేక వందేభారత్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ రైళ్లు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 17 వరకు సేవలు అందించనున్నాయి. ఈ మేరకు భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. పండుగ సీజన్ లో ప్రయాణీకులు ప్రయాణ అనుభవాన్ని సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నార్త్ రైల్వే చీఫ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ ప్రకటించారు.
పండుగ సీజన్ లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ రెండు ప్రత్యేక రైళ్లు దేశ రాజధాని న్యూఢిల్లీ- బీహార్ రాజధాని పాట్నా మధ్య రాకపోకలు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. రైలు నంబర్ 02251, 02252, 02253, 02254 రైళ్లు ప్రత్యామ్నాయ రోజుల్లో నడుస్తాయన్నారు.
ఈ రైలు న్యూఢిల్లీ నుంచి పాట్నా వరకు వెళ్తుంది. పండుగ సీజన్ లో మొత్తం 16 ట్రిప్పులు వేస్తుంది. ఈ రైలు ప్రతి సోమవారం, బుధవారం, శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 15 వరకు నడుస్తుంది. ఉదయం 8.35 నిమిషాలకు న్యూఢిల్లీ నుంచి ఈ రైలు బయల్దేరుతుంది. రాత్రి 9.30 గంటలకు పాట్నాకు చేరుకుంటుంది. మొత్తంగా 12 గంటల 55 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుంది. ఈ రైలు అలీగఢ్, కాన్పూర్ సెంట్రల్, ప్రయాగ్ రాజ్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, అరాలో ఆగుతుంది.
ఈ రైలు పాట్నా నుంచి న్యూఢిల్లీ వరకు నడుస్తుంది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 16 మధ్య ప్రతి మంగళవారం, గురువారం, ఆదివారం నడుస్తుంది. మొత్తం 16 ట్రిప్పులు వేస్తుంది. పాట్నా నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరే ఈ రైలు రాత్రి 11.30 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. మొత్తంగా 13.30 గంటల పాటు ప్రయాణిస్తుంది. ఈ రైలు అరా, బక్సర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ సెంట్రల్, అలీఘర్ లో ఆగుతుంది.
ఈ రైలు పాట్నా నుంచి న్యూఢిల్లీకి ప్రయాణిస్తుంది. ఈ రైలు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 17 వరకు 17 ట్రిప్పులు వేస్తుంది. ప్రతి సోమవారం, బుధవారం, శనివారం అందుబాటులో ఉంటుంది. పాట్నా నుంచి ఈ రైలు ఉదయం 10 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటుంది. మొత్తంగా 13 గంటల 30 నిమిషాల పాటు ప్రయాణం కొనసాగుతుంది. అరా, బక్సర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్ స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలు న్యూఢిల్లీ నుంచి పాట్నా వరకు నడుస్తుంది. మొత్తంగా 16 ట్రిప్పులు వేయనుంది. మంగళవారం, గురువారం, ఆదివారం అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 16 వరకు నడుస్తుంది. న్యూఢిల్లీ నుంచి ఉదయం 8.35 బయల్దేరుతుంది. రాత్రి 9.30 గంటలకు పాట్నాకు చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 12 గంటల 55 నిమిషాల పాటు ప్రయాణిస్తుంది. అలీగఢ్, కాన్పూర్ సెంట్రల్, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, అరాలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు 20 కోచ్ లతో నడవనున్నాయి.
Read Also: ఇక ఆ 10 రైళ్లు తిరుపతి నుంచి కాదు తిరుచానూరు నుంచి నడుస్తాయట, ఎందుకంటే?