Kotha Lokah OTT: ఈమధ్య భారీ యాక్షన్ చిత్రాలు మాత్రమే కాదు.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. కొన్ని సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాయి. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన సినిమాల రికార్డ్ ను రీసెంట్ గా వచ్చిన మలయాళీ చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ తుడిచిపెట్టేసింది. అద్భుతమైన స్టోరీతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఒక్క సినిమా స్టోరీ బాగుండడం మాత్రమే కాదు అటు కలెక్షన్లు భారీగా వసూల్ చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీగా కలెక్షన్లను వసూలు చేయడం మామూలు విషయం కాదు. ఇప్పటికీ ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. స్ట్రీమింగ్ ఎప్పుడన్నది ఒకసారి తెలుసుకుందాం..
‘కొత్త లోక’ మూవీ థియేటర్లలోకి వచ్చినప్పుడు పాజిటివ్ టాక్ తో పాటుగా మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జియో హాట్ స్టార్’ సొంతం చేసుకోగా… ఈ నెల 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 20 స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగుతో పాటు అన్ని పాన్ ఇండియా భాషలలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో తెస్తుంది హాట్ స్టార్. థియేటర్ లో రికార్డులు కొల్లగొట్టిన లోక ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి..
Also Read : రీతూ లవ్ స్టోరీ పై మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్.. నెక్స్ట్ ఎలిమినేట్ ఆమె..?
ఇదొక లేడీ ఒరియేంటెడ్ మూవీ.. రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ రీసెంట్గా రూ.300 కోట్ల క్లబ్లోకి చేరింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు గతంలో వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసుకుంటూ వచ్చేసింది. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే ఒక అమ్మాయికి సూపర్ పవర్ ఉంటే ఎలా ఉంటుంది అనే అంశంతో స్టోరీని తెరకెక్కించారు. ఓ సాధారణ అమ్మాయిలా బెంగుళూరు వచ్చిన ఆమె రెస్టారెంట్లో జాబ్ చేసుకుంటూ ఉంటుంది. తన పవర్స్ బయట పడనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఆమెకు అద్దెకు దిగిన ఇంటి ఎదురు అపార్ట్మెంట్లోనే సన్నీ అనే కుర్రాడు ఉంటాడు. తన ఫ్రెండ్ తో కలిసి అపార్ట్మెంట్లో ఉంటాడు. మొదటి చూపులోనే చంద్రను ఇష్టపడి పోతాడు.. ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఫాలో కాగా సూపర్ పవర్స్ ఉన్న విషయం తెలుస్తుంది. అసలు ఆమె ఎవరు? సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి?. ఆమె ఏమైనా గతంలో ఇబ్బందులను ఎదుర్కొందా? ఒక పోలీస్ ఆఫీసర్ ఆమె వెంట ఎందుకు పడుతున్నాడు ఇవన్నీ తెలుసుకునే పనిలో ఉంటాడు సన్నీ.. ఈ క్రమంలో అతనికి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మరి వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది స్టోరీ.. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీ ఓటీటీలో ఏమాత్రం వ్యూస్ ని రాబడుతుందో చూడాలి…