దసరా వేడుకల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా నుంచి గుజరాత్ కు వచ్చిన ఓ జంటలకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. క్షమాపణులు చెప్పడమే కాకుండా, దేశ విడిచిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన వడోదరలో జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తాజాగా వడోదరలోని కలాలి ప్రాంతంలో దాండియా వేడుక జరిగింది. యునైటెడ్ వే గర్బా వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ ఎన్నారై జంట కూడా ఈ వేడుకలో పాల్గొంది. ఈ సందర్భంగా వాళ్లు ముద్దు పెట్టుకుంటూ గర్బా స్టెప్ వేశారు. ఈ వీడియోలో ప్రతీక్ పటేల్, అతడి భార్య కిస్ ఇచ్చుకున్నారు. ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు చాలా మంది ఈ జంట ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర పండుగను ఈ జంట అపహాస్యం చేసిందని మండిపడ్డారు. పలువురు తీవ్ర విమర్శలు చేశారు.
ప్రతీక్ పటేల్ జంట గుజరాత్ కు చెందిన వారు. చాలా సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. వీరు ఆస్ట్రేలియన్ పౌరసత్వం కలిగి ఉన్నారు. తరచుగా తమ కుటుంబ సభ్యులను చూసేందుకు గుజరాత్ కు వస్తుంటటారు. ఈ జంటకు 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సనాతన్ సంత్ సమితి అనే సంస్థ ఈవెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, న్యాయవాది భవిన్ వ్యాస్ అధికారికంగా అట్లాదర పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి, భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ జంటపై ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులను కోరారు.
హిందూ సంస్థల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రతీక్ దంపతులను పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. కేసు గురించి వివరించారు. అయితే, సదరు జంట జరిగి పొరపాటుకు చింతిస్తున్నట్లు తెలిపారు. లిఖితపూర్వక క్షమాపణలు తెలిపారు. “నవరాత్రి సమయంలో గర్బా డ్యాన్స్ సందర్భంగా ఓ జంట ముద్దు పెట్టుకున్నారు. ఈ విషయంపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే, సదరు జంట స్టేషన్ కు వచ్చి, జరిగిన ఘటన పట్ల క్షమాపణలు చెప్పారు. లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్తూ లేఖ ఇచ్చారు. తమ మీద కేసు నమోదు చేయకూడదని విజ్ఞప్తి చేశారు” అని పోలీసులు వెల్లడించారు.
Garba ek pavitra parampara hai 🙏
Lekin kuch couples ise badnaam kar rahe hain – dance floor par kiss, galat poses aur public mein ashobhniya harkatein 😡@GujaratPolice कृपया ऐसे मामलों पर ध्यान दें।
Garba khelne आएं, अश्लील हरकतें करने नहीं। pic.twitter.com/9o2m8d7Ar7— Nisha Bharti (@Smiley_Nisha0) September 27, 2025
Read Also: ఓర్నీ దుంపతెగ.. ఏంటీ ఇలాంటి సమోసా ఒకటి ఉందా? రుచి చూస్తే అస్సలు వదలరండోయ్!
పోలీస్ స్టేషన్ లో క్షమాపణలు చెప్పిన ప్రతీక్ దంపతులు, ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వాళ్లు ఆస్ట్రేలియాలోని తమ ఇంటికి చేరుకున్నారు. సంతోషంగా గడపాలని వచ్చి అనుకోని వివాదంలో చిక్కడం పట్ల తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
Read Also: ఐఫోన్ కోసం.. ఇన్ స్టాలో క్యూఆర్ కోడ్ పెట్టి మరి అడుక్కుంటున్న అమ్మాయి?