E-Paper
Advertisement

రూ.13 కోట్ల కారు.. మైథిలీపై ట్రోలింగ్.. కంగనా ఫైర్!

రూ.13 కోట్ల కారు.. మైథిలీపై ట్రోలింగ్.. కంగనా ఫైర్!
Advertisement

Maithili Thakur Rolls Royce:ట్రోలింగ్..సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి ఇదొక బర్త్ రైట్ లా అయిపొయింది.పోలిటీషియన్స్,సినీ సెలెబ్రెటీస్ ..ఇలా వారూ వీరూ అన్న తేడా లేకుండా సోషల్ మీడియాలో తమ ట్రోలింగ్ తో టార్గెట్ చేస్తుంటారు .ఇదిగో ఇపుడు యంగ్ సింగర్ బిహార్ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్ కూడా ఇలాంటి ట్రోలింగ్‌ బారినే పడింది. అయితే ఈసారి ఆమెకు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సపోర్ట్ చేయడంతో ఈ వ్యవహారం ఇపుడు నేషనల్ వైడ్ గా వైరల్ అవుతుంది.

అక్కడే ఉంది అసలు ట్విస్ట్

Advertisement

విషయంలోకి వెళ్తే ముంబైలో జరిగే లాల్‌బాగ్చా రాజా దర్శనానికి మైథిలీ ఠాకూర్ వెళ్ళింది.ఇక్కడ ట్రోలింగ్ చేయడానికి ఏముంది అనుకుంటున్నారా ..అక్కడే ఉంది అసలు ట్విస్ట్.తాను వెళ్ళింది ఏ సాదా సీదా కారులో కాదు మరి అక్షరాల 13 కోట్ల విలువ చేస్తుందని అనుకుంటున్న ఓ బ్లూ కలర్ లగ్జరీ రోల్స్ రాయిస్ కలినన్‌లో వచ్చింది మరి.దీంతో ఆమె కార్ తో పాటు ఉన్న వీడియోలో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇంత ఖరీదైన కారులో మైథిలీకి ఎలా వచ్చింది

Advertisement

ఇంకేం అది చూసిన నెటిజన్లు తమ విమర్శల విల్లు ఎక్కుపెట్టేశారు.అసలు“ఇంత ఖరీదైన కారులో మైథిలీకి ఎలా వచ్చింది? పాలిటిక్స్ లోకి వచ్చి పట్టుమని ఏడాది కూడా కాలేదు.. అప్పుడే ఇంత ఖరీదైన కారు ఎలా సొంతం చేసుకుంది ?” అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక మరికొందరైతే ఆమె గతంలో ఉన్న ఆస్తులేంటి, ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఏంటి అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు కూడా.

అయితే అసలు విషయం ఏంటంటే లాల్‌బాగ్చా రాజాకు మైథిలీ వచ్చిన కారు ఆమె సొంత కారేనా? లేక ఎవరి కారు అయినా వాడిందా అన్నది తెలీదు కాని, దాంట్లో ఆమె రావడం చూసి ఆ కారు తనదే అన్నట్టుగా ట్రోలింగ్ మొదలెట్టారు నెటిజన్లు.

కంగనా పోస్టు హాట్ టాపిక్

ఇదిగో సరిగ్గా ఇదే సమయంలో కంగనా రనౌత్ ఎంట్రీ అవడంతో ఈ ఇష్యూకి మరింత పబ్లిసిటీ వచ్చేసింది. మైథిలికి సపోర్ట్ గా “రాజకీయ నాయకులు మంచి జీవితం గడుపుతుంటే కొందరికి ఎందుకు అంత మంట?” అన్నట్టుగా కంగనా పోస్టు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రజల కోసం పనిచేసే వాళ్లంతా ఎప్పుడూ సింపుల్‌గానే ఉండాలి, ఖరీదైన వస్తువులు వాడకూడదు, మంచి లైఫ్‌స్టైల్ ఉండకూడదు అనుకోవడం కరెక్ట్ కాదని తన స్టోరీలో చెప్పుకొచ్చింది కంగనా. రాజకీయాల్లో ఉన్నప్పటికీ వాళ్లకు కూడా సొంత కెరీర్, వ్యక్తిగత జీవితం, సంపాదన ఉంటాయని తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చింది.

2017లో ‘Rising Star India’ 

ఇక మైథిలీ ఠాకూర్ విషయానికి వస్తే.. ఆమె రాజకీయాల్లోకి రాకముందే సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెల్సిందే.చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకున్న మైథిలీ.. మైథిలీ, భోజ్‌పురి, హిందీ పాటలతో పాటు జానపద గీతాలు, భక్తి పాటలు కూడా పాడుతూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకోవడం విశేషం.ముఖ్యంగా 2017లో ‘Rising Star India’ అనే సింగింగ్ రియాలిటీ షోలో కనిపించిన తర్వాత మైథిలీ ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది.

ఎలా తెర పడుతుందో !

ఇక సింగర్‌గా ఫేమ్ తెచ్చుకున్న మైథిలీ రాజకీయాల్లోకి 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో అడుగుపెట్టింది. బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయింది కూడా.చూడాలి మరి ఈ కాస్ట్లీ రోల్స్ రాయిస్ వివాదానికి ఎప్పుడు ఎలా తెర పడుతుందో !

ALSO READ:విజయ్-అజిత్ కలిశారు.. ప్రకాశ్ రాజ్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా!

Tags

Related News

రష్మికను ఇలా ఎప్పుడైనా చూశారా? ‘మైసా’ టీజర్ దిమ్మతిరిగేలా!

పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

విజయ్-అజిత్ కలిశారు.. ప్రకాశ్ రాజ్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా!

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

అనుష్క ఎక్కడ? వివాహమా? కెరియర్?

భర్త కోసం నో రిస్క్.. గుడ్ బై చెప్పనున్న నయనతార!

వెకేషన్ మూడ్‌లో నయనతార.. వైరల్ అవుతున్న పిక్స్!

Big Stories

Advertisement
×