E-Paper
Advertisement

విజయ్-అజిత్ కలిశారు.. ప్రకాశ్ రాజ్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా!

విజయ్-అజిత్ కలిశారు.. ప్రకాశ్ రాజ్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా!
Advertisement

Vijay Ajith Meeting:కోలీవుడ్ దళపతి జోసెప్ విజయ్ అనూహ్యంగా సీయం సీటు ఎక్కినప్పటి నుండి ఎదో రకంగా మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌లో అజిత్ ని విజయ్ కలిసిన సంగతి తెల్సిందే.అయితే ఇదే విషయమే ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేటబుల్ అయింది.

విషయంలోకి వెళ్తే అజిత్ పాల్గొన్న మిచెలిన్ లీ మాన్స్ కప్ రేస్‌కు విజయ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు.పైగా ఆ సెర్మనీలో గ్రీన్ ఫ్లాగ్ ఊపాడు కూడా.ఇక రేస్‌కు ముందు అజిత్‌ను చూసిన విజయ్ సరదాగా నవ్వుతూ అతడిని హాగ్ చేసుకున్న ఫోటోలు మీడియాలో తెగ హైలెట్ అయ్యాయి కూడా.

Advertisement

దీంతో ఇంతకాలం తెరపై పోటా పోటీగా నటించిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇలా కలవడంతో ఇరు హీరోల ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు.పైగా రేస్ కంప్లీట్ అయ్యాక అజిత్‌కు చిన్న రేస్ కారుపై “లవ్లీ బ్రదర్” అంటూ రాసి గిఫ్ట్‌గా ఇచ్చాడు కూడా.ఇక అజిత్ కూడా విజయ్‌కు తన సైన్ చేసిన హెల్మెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.

అంత వరకు బాగానే ఉంది కాని ఇదే ఇదే విషయంపై మరి కొందరు తమ విమర్శల బాణాలని ఎక్కు పెట్టారు. విజయ్ పెట్టుబడుల కోసం లండన్ పోయానని చెప్పి ఇలా రేసింగ్ లు అంటూ ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నాడని,అసలు రాష్ట్రం కోసం పోయాడా లేక తను ఎంజాయ్ చేయడానికి పోయాడా అంటూ ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు.

Advertisement

ఇక ఇదే విషయంపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు ప్రకాష్ రాజ్. మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయ్ విదేశాలకు వెళ్లి అజిత్‌ను కలవడంలో తప్పేముందంటూ క్వశ్చన్ చేశాడు. విజయ్ ఎందుకు వెళ్లారు, ఏం సాధించారు అనేదే చూడాలని చెప్పుకొచ్చాడు. విజయ్ ఎక్కడి వెళ్లి ఏం చేసినా తాను అంతగా పట్టించుకోనని,పైనల్ గా అతడి పర్యటన తమిళ నాడు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చాడా లేదా అన్నదే తాను చూస్తానని విమర్శలకి కౌంటర్ ఇచ్చాడు.

అంతేకాకుండా .. సీఎం గా విజయ్ ఎలా పని చేస్తున్నాడో అప్పుడే ఒక అంచనాకి రావడం తొందరపాటు అవుతుందని తెలిపారు.ప్రభుత్వం ఏర్పడి దాదాపు 120 రోజులు మాత్రమే అవుతుంది కాబట్టి విజయ్‌కు కనీసం ఏడాది సమయం ఇవ్వాలని, ఆ తర్వాత ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూసి ప్రశ్నలు అడగొచ్చని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్‌ను చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా చెప్పాలని ప్రకాశ్ రాజ్ సూచించారు. అంటే.. ఇప్పుడే తొందరపడి ప్రభుత్వం గురించి ఒక నిర్ణయానికి రావడం కంటే, విజయ్ కి కొంత సమయం ఇచ్చి ఫలితాలను చూడాలన్నది ఆయన వాదన అన్నమాట.

ఇక విజయ్-అజిత్ కాంబినేషన్ విషయానికి వస్తే 1995లో వచ్చిన ‘రాజావిన్ పార్వైయిలే’ తర్వాత ఇద్దరూ కలిసి తెరపై కనిపించకపోవడం గమనార్హం.విజయ్ ‘పూవే ఉనక్కాగ’, ‘గిల్లి’, ‘తుపాకి’, ‘మెర్సల్’, ‘మాస్టర్’, ‘లియో’ వంటి సినిమాలతో విజయ్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటే అజిత్ ‘మంకథ’, ‘వీరం’, ‘ఎన్నై అరిందాల్’, ‘వలిమై’, ‘తునివు’, ‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమాలతో తలగా క్రేజ్ సంపాదించాడు.

ALSO READ:వెకేషన్ మూడ్‌లో నయనతార.. వైరల్ అవుతున్న పిక్స్!

మొత్తానికి.. సిల్వర్‌స్టోన్‌లో విజయ్-అజిత్ మీటింగ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తే విమర్శకులకి మాత్రం మంచి ట్రోలింగ్ స్టఫ్ ని తెచ్చిపెట్టాయి.చూడాలి మరి ప్రకాష్ రాజ్ కామెంట్స్ పై విమర్శకులు ఎలా రియాక్ట్ అవుతారో !

Tags

Related News

రూ.13 కోట్ల కారు.. మైథిలీపై ట్రోలింగ్.. కంగనా ఫైర్!

పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

అనుష్క ఎక్కడ? వివాహమా? కెరియర్?

భర్త కోసం నో రిస్క్.. గుడ్ బై చెప్పనున్న నయనతార!

వెకేషన్ మూడ్‌లో నయనతార.. వైరల్ అవుతున్న పిక్స్!

హిట్ కొడితే రేటు పెంచేస్తున్న హీరోయిన్లు!

Big Stories

Advertisement
×