E-Paper
Advertisement

అనుష్క ఎక్కడ? వివాహమా? కెరియర్?

అనుష్క ఎక్కడ? వివాహమా? కెరియర్?
Advertisement

Anushka Shetty:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అనుష్క శెట్టి (Anushka Shetty) అలియాస్ స్వీటీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా అద్భుతమైన నటనతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది.. అరుంధతిలో జేజమ్మగా ఆమె చూపించిన రౌద్రం.. బాహుబలిలో దేవసేనగా ఆమె చూపించిన రాజసం, భాగమతిలో ఆమె సృష్టించిన భయం, సైజ్ జీరోలో ఆమె చూపించిన అమాయకత్వం సినీ ప్రియుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.

ఇండస్ట్రీకి అనుష్క దూరం?

స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె.. అదే హీరోలతో సమానంగా ఓపెనింగ్స్ రాబట్టిన అతి కొద్ది మంది హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలతో.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ఈమె.. అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరంగా.. సైలెంట్ అయిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. మధ్యలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ మళ్ళీ పలకరించిన ఈమె.. పర్వాలేదు అనిపించుకుంది. మళ్లీ గ్యాప్ తీసుకుని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ అనే సినిమా చేసింది. కానీ ఇది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక మలయాళం లో జయ సూర్యతో కలిసి కథనార్ అనే భారీ ఫాంటసీ డ్రామాలో కూడా నటించింది.

కథల ఎంపిక విషయంలో తడబాటు..

Advertisement

అయితే ఇప్పుడు మళ్ళీ ఆమె మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో నిత్యం సెట్స్ పై బిజీబిజీగా గడిపిన ఈ లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు కథల ఎంపిక విషయంలో విపరీతమైన సెలెక్టివ్ గా మారారా? లేక పూర్తిగా సినిమాలకు దూరం జరగాలని నిర్ణయించుకున్నారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొత్త సినిమా అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు..

పెళ్లికి సిద్ధం అవుతోందా?

ఇదిలా ఉండగా మరొకవైపు అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ కొంత కాలం వార్తలు వినిపించాయి. పెద్దలు కుదిర్చిన వివాహము అని కొంతమంది అంటే.. మరి కొంతమంది బెంగళూరులో ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోంది అంటూ ఇలా ఎవరికి వారు పలు కథనాలు సృష్టించారు. అయితే అందులో ఏది నిజం కాలేదు. ఇటు కెరియర్ పరంగా ఫోకస్ పెట్టకుండా. అటు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టకుండా.. అసలు అనుష్క ఏం చేస్తోంది ? ఎక్కడ ఉంది? అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి నిజంగా అనుష్క వివాహానికి సిద్ధమవుతున్నారా ? లేక సరైన కథ కోసం ఎదురు చూస్తున్నారా? అనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.

Advertisement

ALSO READ:భర్త కోసం నో రిస్క్.. గుడ్ బై చెప్పనున్న నయనతార!

మళ్లీ ఇతర పై కనిపించాలంటే అభిమానుల ఆరాటం..

ఏది ఏమైనా అందం, అభినయంతో, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గొప్ప నటి అనుష్క.. ఈమధ్య తెరపై కనిపించకుండా తెరమరుగవడం చూస్తుంటే అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మళ్ళీ మంచి కథతో తెరపైకి రావాలి అని.. మునుపటి వైభవాన్ని తిరిగి పొందాలని.. మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. మరి అనుష్క అభిమానుల కోరిక మేరకు ఎప్పుడు మళ్ళీ తెరపై సందడి చేస్తుందో చూడాలి.

Related News

పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

విజయ్-అజిత్ కలిశారు.. ప్రకాశ్ రాజ్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా!

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

భర్త కోసం నో రిస్క్.. గుడ్ బై చెప్పనున్న నయనతార!

వెకేషన్ మూడ్‌లో నయనతార.. వైరల్ అవుతున్న పిక్స్!

హిట్ కొడితే రేటు పెంచేస్తున్న హీరోయిన్లు!

శోభిత పై నాగ్ మామ ప్రశంసలు…కోడలి కష్టానికి ఫిదా!

Big Stories

Advertisement
×