Nayanthara Photos:నయనతార ..తమిళ సూపర్ స్టార్ గా క్రేజ్ కొట్టేసిన ఈ వెటరన్ బ్యూటీ అటు సినిమాతో బిజీగా ఉంటూనే మరో వైపు సోషల్ మీడియాలో తనవైన అప్ డేట్స్ ని పోస్ట్ చేస్తూ తెగ సందడి చేస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా బీచ్‌లో దిగిన కొన్ని ఫొటోలను నయన్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.అందులో సముద్రం బ్యాక్ డ్రాప్ లో ,బ్లూ స్కై , ఎల్లో కలర్ డ్రెస్‌లో నయనతార క్లాసీ లుక్ లో కనిపించడంతో ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్.
తన స్టైల్లో పోజులు ఇచ్చిన నయన్
ఈ ఫొటోల్లో నయనతార చాలా కూల్‌గా కనిపిస్తోందనే చెప్పాలి.ముఖ్యంగా లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని, కళ్లకు సన్‌గ్లాసెస్ పెట్టుకుని సముద్రం ఒడ్డున తన స్టైల్లో పోజులు ఇచ్చిన నయన్ లుక్ ఎవర్ గ్రీన్. ఇక మరో ఫొటోలో సముద్రపు నీళ్ల మధ్య నిలబడి కెమెరా వైపు చూస్తూ కనిపించింది. ఇంకో పిక్‌లో మాత్రం బీచ్‌లో చెప్పులు చేతిలో పట్టుకుని నడుస్తూ కనిపించడం హైలైట్‌గా అనే చెప్పాలి. సింపుల్ మేకప్ అండ్ సింపుల్ లుక్‌లో కనిపించినా.. నయన్ గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదుగా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.
ఈ ఫోటోలలో మరీ ముఖ్యంగా ఎల్లో డ్రెస్, వెనక కనిపిస్తున్న బ్లూ వాటర్ కలర్ ఈ ఫొటోలకు మంచి లుక్ ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఇక నయనతార పోస్ట్ చేసిన ఫొటోలు కాస్తా ఫ్యాన్స్ పేజీల్లోకి, సోషల్ మీడియా పోస్టుల్లోకి వెళ్లిపోవడంతో “వెకేషన్ మోడ్‌లో నయన్ అదిరిపోయింది”గా అంటూ కొందరు కామెంట్స్ పెడితే ఇలా ఫోజులు ఇవ్వాలంటే నయన్ తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అభిమానులని మరింత ఫిదా
నిజానికి నయనతారకు ట్రావెల్, వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కొత్తేమీ కాదు. ఇదివరకు చాలా సార్లు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్ని బెస్ట్ మెమోరీస్ ని ఇలా సోషల్ మీడియాలో షేర్ చేస్తునే ఉంటుంది. ముఖ్యంగా విఘ్నేష్ శివన్‌తో కలిసి చేసే ట్రిప్స్, బర్త్‌డే సెలబ్రేషన్స్, ఫ్యామిలీ మూమెంట్స్‌కు సంబంధించిన ఫొటోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి కూడా. అయితే ఈసారి మాత్రం నయన్ సోలోగా కనిపించిన బీచ్ ఫొటోలే ఇపుడు అభిమానులని మరింత ఫిదా చేసేస్తున్నాయి.
సినిమాల విషయానికి వస్తే
ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే సౌత్ లో తులసి, ‘శ్రీ రామ రాజ్యం’‘ సింహా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ఈ భామ తమిళంలో ‘చంద్ర ముఖి’, ‘రాజా రాణి’, ‘నానుమ్ రౌడీ ధాన్’, ‘ఇరు ముగన్’, ‘నెట్రికన్’ వంటి సినిమాలతో కోలీవుడ్ టాప్ స్టార్ గా క్రేజ్ కొట్టేసింది.
ఇక బాలీవుడ్‌లో ‘జవాన్’ సినిమాతో నార్త్ ఆడియన్స్‌కి కూడా బాగా కనెక్ట్ అయింది. షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లని కొట్టేయడంతో నేషనల్ వైడ్ ఫ్యాన్స్ బేస్ ని సంపాదించింది. అయితే ఈ మధ్య కీలక పాత్రలో కనిపించిన టాక్సిక్ అనుకున్నంత ఆడకపోవడం గమనార్హం.
ALSO READ:హిట్ కొడితే రేటు పెంచేస్తున్న హీరోయిన్లు!
మొత్తానికి సినిమా న్యూస్ తో మీడియాలో సందడి చేసే నయన్ ఈసారి మాత్రం ఎలాంటి మూవీ అప్‌డేట్ ఇవ్వకుండా తన వెకేషన్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచిందనే పెంచాలి !