Kamakshi Bhaskarla: తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ అనే స్టేజ్ నుండి.. అదృష్టం ఉండి .. నటనలో సత్తా కనపరిచి దర్శక నిర్మాతల కథకు ప్రాణం పోయేగలిగితే తెలుగమ్మాయిలే టాప్ అంటూ నిరూపించింది కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) . అందం, అభినయంతో కాదు డి గ్లామరస్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే తన అద్భుతమైన నటన ప్రతిభతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. పొలిమేర 1,2 చిత్రాలతో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎమ్మెస్ రాజు తెరకెక్కించిన అగధ సినిమాలో లీడ్ రోల్ పోషించి తన అసాధారణమైన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది..
అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిని అలా అని మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ మేల్ యాంకర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రదీప్ మాచిరాజు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . సెప్టెంబర్ 27వ ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. ఇందులో కామాక్షి భాస్కర్ల తన టీం తో వచ్చి సందడి చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆల్ ఇండియా టూర్ పేరిట ఒక కొత్త స్కిట్ చేశారు. ట్రావెల్ బస్సు స్టార్ట్ అవ్వగానే ఆగండి అంటూ కామాక్షి భాస్కర్ల పరిగెత్తుకుంటూ బస్సు వైపు వచ్చింది. బస్సులో ఉన్న హైపర్ ఆది ఆమె చేయి పట్టుకోగా.. ఆమె కింద పడకుండా ప్రదీప్ వెనుక నుండి ఆమెకు సపోర్ట్ ఇచ్చారు.
ఇక కామాక్షి భాస్కర్ల ను ప్రదీప్ చూస్తూ మీరు కాశ్మీర్లో పుట్టారా ? అని అడగ్గా.. దానికి ఎందుకు అని కామాక్షి అడిగింది. దానికి ప్రదీప్ మీరు కాశ్మీర్ ఆపిల్ లా ఉంటేనూ అంటూ చెప్పగానే కామాక్షి మురిసిపోయింది. ఆ తర్వాత ప్రదీప్ తో మాట్లాడుతూ మీరు మైసూర్లో పుట్టారా అని అడిగితే .. ఎందుకు అని ప్రదీప్ అడగ్గా.. మీరు మైసూర్ మహారాజులా ఉన్నారు అంటూ కామాక్షి చెప్పడంతో ప్రదీప్ గాల్లో తేలిపోయారు. మధ్యలో హైపర్ ఆది కలుగజేసుకొని ఎందుకండీ ఇవన్నీ మనం ప్యాసింజర్ లో కాదండి ఫ్యామిలీ లా కలిసి ఉండాలి అని చెప్పగానే వెంటనే కామాక్షి భాస్కర్ల సరే అన్నయ్య అంటూ కౌంటర్ వేసింది.
also read: అనుష్క ఎక్కడ? వివాహమా? కెరియర్?
కామాక్షి అన్నయ్య అని పిలవగానే హైపర్ ఆది కింద నుంచి పై వరకు చూసి ఇక ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా పక్కకు తిరిగేసాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వులలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.