E-Paper
Advertisement

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Advertisement

The Paradise Movie: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ 21వ తేదీ శిల్పకళా వేదిక హైదరాబాదులో జరగబోతున్న సంగతి తెలిసిందే మరి కాసేపట్లో నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవుతున్నాయి.

టికెట్ ధరలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం..

ఇలా ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నుంచి చిత్ర బృందానికి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచడానికి తెలంగాణ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు టికెట్ ధరలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్ర బృందం కోరారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ సినిమా టికెట్ ధరలు పెంపుకు అనుమతి లభించిందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ప్రీమియర్లకు అలాగే సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లకు ఎంత మొత్తంలో టికెట్ ధరలను పెంచారు అనే విషయానికి వస్తే..

ప్రీమియర్ టిక్కెట్ ధర రూ. 500..

Advertisement

ది ప్యారడైజ్ సినిమా ప్రీమియర్లు సెప్టెంబర్ 23వ తేదీ ప్రసారం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రీమియర్ టికెట్ ధరలను జీఎస్టీ లతో కలిపి 500 రూపాయలు నిర్ణయించింది. అలాగే ఈ సినిమా 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రూ. 48 , మల్టీప్లెక్స్ థియేటర్లకు రూ.95/జిఎస్టి లతో కలిపి పెంచేశారు. ఇక సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.23 , మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.45 ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. ఇక అక్టోబర్ 4వ తేదీ నుంచి పెంచిన ధరలు అందుబాటులో ఉండవని తెలియజేశారు.

ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతిస్తుందా..

ఇలా ఈ సినిమా టికెట్ ధరలను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలపడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో కూడా ఈ సినిమా టికెట్ ధరలను పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కూడా కోరారు. మరి ఏపీలో ఈ సినిమా టికెట్ ధరలు పెరుగుతాయా?లేదంటే యధావిధిగా కొనసాగుతాయా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని ఎస్ఎల్వి సినీ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ఖయాదు లోహర్ జంటగా నటించారు. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

Also Read: శోభిత పై నాగ్ మామ ప్రశంసలు…కోడలి కష్టానికి ఫిదా!

Related News

రూ.13 కోట్ల కారు.. మైథిలీపై ట్రోలింగ్.. కంగనా ఫైర్!

పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

విజయ్-అజిత్ కలిశారు.. ప్రకాశ్ రాజ్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా!

అనుష్క ఎక్కడ? వివాహమా? కెరియర్?

భర్త కోసం నో రిస్క్.. గుడ్ బై చెప్పనున్న నయనతార!

వెకేషన్ మూడ్‌లో నయనతార.. వైరల్ అవుతున్న పిక్స్!

హిట్ కొడితే రేటు పెంచేస్తున్న హీరోయిన్లు!

Big Stories

Advertisement
×