E-Paper
Advertisement

జూరాల డ్యామ్‌ వద్ద ఉత్కంఠ.. రైతుల ధర్నాతో పోలీసులు పహారా!

జూరాల డ్యామ్‌ వద్ద ఉత్కంఠ.. రైతుల ధర్నాతో పోలీసులు పహారా!
Advertisement

Jurala Project: స్వేచ్ఛ బ్యూరోొ: జూరాల ప్రాజెక్టు వద్ద ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. నీటి విడుదల కోసం రైతుల ఆందోళనల దృష్ట్యా జూరాల డ్యాంకు పోలీసులు పహార కాస్తున్నారు. శనివారం నీటి కోసం రైతులు డ్యాం ను ముట్టడించి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం లేకపోవడంతో అధికారులు జూరాల గేట్లను మూసివేశారు. అదే క్రమంలో జోగులాంబ గద్వాల, వనపర్తి,మహబూబ్ నగర్ జిల్లాలకు జూరాల డ్యాం ద్వారా ప్రవహించే ఎడమ, కుడి కాలువలకు నీటి విడుదలను నిలిపివేశారు. ఈ క్రమంలో ఇప్పటికే సాగు చేస్తున్న ఆయకట్టు రైతులు తమ పంట పొలాలు ఎండుతున్నాయని, నీటిని విడుదల చేయాలని జూరాల డాం పై ధర్నా చేపట్టారు. గద్వాల ప్రాంత రైతులు ధర్నా చేపట్టగా ఎడమ కాలువ నీటి కోసం రైతులు ఏకంగా సాయంత్రం వేళ ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండా కాల్వ గేట్లను ఓపెన్ చేశారు.

ఇరిగేషన్ అధికారుల అప్రమత్తత

ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతం జూరాల డాం కు ఇన్ ఫ్లో లేకపోవడంతో అధికారులు విధి లేక సాగునీటిని సైతం నిలుపుదల చేశారు. దీంతో రైతులు చేస్తున్న ఆందోళన దృష్ట్యా సాగు నీటి కోసం గేట్లను తెరవడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. జూరాల ప్రాజెక్టు నీటి వనరులను కాపాడే క్రమంలో పోలీస్ బందోబస్తు కోరారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్పెషల్ పార్టీ బృందం కుడి, ఎడమ గేట్ల దగ్గర పహార కాస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తాగునీటికి తొలి ప్రాధాన్యం

Advertisement

ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ లో నుంచి జూరాలకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం జూరాల డ్యాం నీటి నిలువ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.810 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీటి అవసరాల కోసం నీలో ఉంచినట్లు ఎస్. ఈ కేశవరావు తెలిపారు. రైతులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ఖరీఫ్ సాగు ఆరంభంలోనే ఆరుతడి పంటలను సాగు చేయాలని, కేవలం తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని రైతులకు సూచించామన్నారు.

Also read: హోటళ్ల ముసుగులో ఓపెన్ బార్లు.. తూముకుంట దాబాల్లో ఏం జరుగుతోంది?

Tags

Related News

చికెన్, మటన్ షాప్‌లో మీకు ఇలా జరిగిందా.. అయితే బీకేర్ ఫుల్!

మేం అధికారంలోకి వస్తే చేసే మొట్టమొదటి పని ఇదే.. కవిత క్లారిటీ..?

ఆలేరులో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన కీలక నాయకులు!

హోటళ్ల ముసుగులో ఓపెన్ బార్లు.. తూముకుంట దాబాల్లో ఏం జరుగుతోంది?

డేట్ టైమ్ ఫిక్స్ చెయ్.. కేటీఆర్‌కు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్!

తెలంగాణలో మరో వారంపాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

నోరు అదుపులో పెట్టుకోండి.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×