E-Paper
Advertisement

Manasa Varanasi: మిస్ ఇండియాకు ఈ హీరో హిట్టిస్తాడా?

Manasa Varanasi: మిస్ ఇండియాకు ఈ హీరో హిట్టిస్తాడా?
Advertisement

Manasa Varanasi: మానస వారణాసి.. ఈ పేరు అందరికీ పరిచయమే. 2020లో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా’ పోటీల్లో ఆమె విజేతగా నిలిచి కిరీటాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత భారతదేశం తరపున అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మిస్ వరల్డ్ 2021 పోటీల్లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ భామ ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రంతోనే హీరోయిన్‌గా పరిచయమయ్యారు. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో, నటిగా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడామె ఆశలన్నీ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) పైనే పెట్టుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ (Santosh Soban) హీరో. మానస వారణాసి (Manasa Varanasi) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ‌గా తెరకెక్కిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో

Also Read- Priyamani: ‘మెగా158‌’లో ప్రియమణి.. బాబోయ్ అంత రెమ్యూనరేషనా?

రోలర్ కోస్టర్ రైడ్

Advertisement

హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మిత్ర అనే పాత్రలో నటించాను. ఇలాంటి అందమైన పాత్రలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మిత్ర పాత్రతో నేను పర్సనల్‌గా బాగా కనెక్ట్ అయ్యాను. ఈ పాత్ర నా పర్సనల్ లైఫ్‌కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. నాలాగే లైఫ్‌లో ఏదైనా చేయాల్సివస్తే ముందు యాక్షన్‌లోకి దిగేస్తుంది. ఆ సమయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోదు. ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ వంటిది. చెన్నై బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్, యంగ్ లవ్ స్టోరీ. మేము చెన్నైలోని అనేక ప్రాంతాల్లో గెరిల్లా టైప్‌లో షూటింగ్ చేశాం. సంతోష్ శోభన్ చాలా మంచి యాక్టర్. ఆయన డెడికేషన్, ప్రతి సీన్‌లో ఇంకా బాగా నటించాలనే తపన నాకు బాగా నచ్చాయి. నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాతో నాకు కచ్చితంగా సక్సెస్ వస్తుందనే నమ్మకముంది. ‘కపుల్ ఫ్రెండ్లీ’.. కేవలం కపుల్స్ కోసమే కాదు.. సింగిల్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం కూడా. ఈ నెల 14న థియేటర్స్‌లోకి వస్తున్న ఈ సినిమా చూసి అంతా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read- Viral News: హెల్మెట్ లేదని ఒకే రోజులో రెండుసార్లు ఫైన్.. పోలీస్ స్టేషన్ ఫ్యూజ్ పీకేసిన లైన్‌మెన్

గ్యాప్ తీసుకున్న మాట నిజమే..

Advertisement

సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. యూవీ క్రియేషన్స్ నా ఫ్యామిలీ లాంటిది. ఈ బ్యానర్‌లో వచ్చే ప్రతి సినిమా మాది అనుకుంటాం. డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ చేయబోయే ఎన్నో మంచి చిత్రాల్లో మొదటిగా వస్తుంది ‘కపుల్ ఫ్రెండ్లీ’. ప్రపంచ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించి, పేరు తీసుకొచ్చిన మానస వారణాసి ఇందులో హీరోయిన్. ఆమెతో కలిసి నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో మిత్ర క్యారెక్టర్‌ను ఆమె కంటే బెటర్‌గా ఎవరూ చేయలేరేమో అనిపించింది. నేను చిన్న గ్యాప్ తీసుకున్న మాట వాస్తవమే. ఈ సారి నేను చూపించబోయే కథ.. ఇరవై ఏళ్ల పాటు మీకు గుర్తుండిపోవాలి అనుకుని ఈ సినిమా చేశాను. శివ అనే క్యారెక్టర్‌కు ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తాను. శివ నెల్లూరు నుంచి వచ్చిన అబ్బాయి, మిత్ర చిత్తూరు నుంచి వస్తుంది. వాళ్లు చెన్నైలో కలుస్తారు. శివ, మిత్ర అనే పాత్రలు మిమ్మల్ని నవ్విస్తాయి, కదిలిస్తాయి. కాస్త ఏడిపిస్తాయి. ఇది హానెస్ట్‌గా చేసిన సినిమా. నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెప్పుకొచ్చారు.

Also Read- Box Office War: విజయ్ ‘జన నాయగన్’ టు యష్ ‘టాక్సిక్’ వరకు.. షెడ్యూల్ ఖరారు!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×