E-Paper
Advertisement

Box Office War: విజయ్ ‘జన నాయగన్’ టు యష్ ‘టాక్సిక్’ వరకు.. షెడ్యూల్ ఖరారు!

Box Office War: విజయ్ ‘జన నాయగన్’ టు యష్ ‘టాక్సిక్’ వరకు.. షెడ్యూల్ ఖరారు!
Advertisement

Box Office War: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi), నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రాలు అనుకున్న తేదీకి వచ్చే అవకాశం లేదనే క్లారిటీ రావడంతో, స్టార్ హీరోల సినిమాలు కొన్ని ఆ డేట్స్‌ని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. విజయ్ ‘జన నాయగన్’ టు యష్ ‘టాక్సిక్’ వరకు ఖరారైన షెడ్యూల్‌ను బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది. సంక్రాంతి‌కి వచ్చిన సినిమాల జాతర అనంతరం.. ఇప్పుడు మరోసారి భారీ బడ్జెట్ సినిమాలు, పాన్-ఇండియా స్టార్ల చిత్రాలు విడుదల తేదీలను లాక్ చేసుకుని, మరో జాతరకు సిద్ధమవుతున్నాయి. ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’ డౌట్స్‌లో ఉండటంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రాన్ని ముందుకు తెచ్చేశారు. ఇటీవల నిర్మాత ఏప్రిల్‌లో రిలీజ్ అని చెప్పిన విషయం తెలిసిందే. కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమ్మర్ సీజన్‌కు గట్టి ఆరంభాన్ని ఇచ్చేందుకు ‘గబ్బర్ సింగ్’ మళ్లీ ఖాకీ డ్రెస్ వేసి రెడీ అవుతున్నాడన్నమాట.

‘జన నాయగన్’ ఎప్పుడంటే?

దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) పై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. పొంగల్‌కు రావాల్సిన ఈ సినిమా సెన్సార్ ఇబ్బందుల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం రీ-సెన్సార్ ప్రక్రియలో ఉంది. ఒకవేళ అంతా అనుకున్నట్లు సవ్యంగా జరిగితే, ఫిబ్రవరి 13 లేదా 14న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విజయ్ ఫ్యాన్స్‌కు ఇది అతిపెద్ద ట్రీట్ అనే చెప్పాలి.

Advertisement

Also Read- Jana Nayagan: విజయ్ చివరి సినిమా జన నాయగన్‌కు కొత్త ట్విస్ట్.. కీలక 20 నిమిషాలు కట్..!

‘టాక్సిక్’ వర్సెస్ ‘ధురందర్ 2’

ఇక మార్చి నెలలో అసలైన సమరం మొదలుకాబోతోంది. రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ (Toxic), బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ‘దురంధర్ 2’ (Dhurandhar 2) రెండూ.. మార్చి 19న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ విడుదల తేదీలో ఎటువంటి మార్పు ఉండదు. ఆ వెంటనే అంటే, మార్చి 26న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా థియేటర్లలోకి దిగనున్నారు. మొత్తంగా చూస్తే మార్చి నెల సినిమా ప్రేక్షకులకు అసలు, సిసలు ట్రీట్ ఇవ్వబోతుందనేది స్పష్టమవుతోంది. ‘టాక్సిక్, దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ మూడు చిత్రాలపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వారం గ్యాప్‌లోనే ఈ మూడు సినిమాలు పోటీ పడనున్నాయి.

పివిఆర్ (PVR) కనెక్షన్ విషయానికి వస్తే..

Advertisement

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పివిఆర్ సంస్థ ‘జన నాయగన్’ హక్కులను మాత్రమే కొనుగోలు చేసింది. ‘టాక్సిక్’తో పివిఆర్‌కు ప్రస్తుతానికి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ‘జన నాయగన్’ విడుదలైన తర్వాతే ‘టాక్సిక్’ బిజినెస్ డీల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే, విడుదల తేదీ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మార్చి 19న యష్ బాక్సాఫీస్ వేట మొదలెట్టనున్నారు. ‘జన నాయగన్’, ‘టాక్సిక్’ చిత్రాలను కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Also Read- Meesaala Pilla Song: ‘మీసాల పిల్ల’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూసేయండిక!

Related News

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

Big Stories

Advertisement
×