Viral News: యూపీలో హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు ఓ లైన్ మెన్ కు ట్రాఫిక్ పోలీసులు ఒకే రోజులో రెండుసార్లు ఫైన్ వేశారు. దీంతో షామ్లి జిల్లాలోని జింఝానా పోలీస్ స్టేషన్ పరిధిలోని బిదౌలి పోలీస్ అవుట్ పోస్ట్ కు చట్టబద్ధమైన విద్యుత్ కనెక్షన్ లేదని గుర్తించిన..ఆ లైన్ మెన్ విద్యుత్ కనెక్షన్ కట్ చేశాడు.
బిదౌలి అవుట్‌పోస్ట్ ముందు జనవరి 28న వాహన తనిఖీలు చేపట్టారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టు లైన్‌మెన్‌గా పనిచేస్తున్న అషు కుమార్‌కు ఆ మార్గంలో వచ్చాడు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు పోలీసులు అషుకుమార్ కు రూ.1,000 చలాన్ వేశారు. దాదాపు గంట తర్వాత అదే మార్గం ద్వారా తిరిగి వచ్చినప్పుడు అతడిపై మళ్లీ రూ.1,000 మరో చలాన్ వేశారు. ఆ రోజు సాయంత్రం అషు కుమార్ ఒక బృందంతో కలిసి, అవుట్‌పోస్ట్‌లో తనిఖీ నిర్వహించాడు. ఆ అవుట్ పోస్ట్ కు చట్టబద్ధమైన విద్యుత్ కనెక్షన్ లేదని తెలుసుకున్నాడు.
అనంతరం అవుట్‌పోస్ట్‌లోని పోలీసు సిబ్బందికి విద్యుత్ కనెక్షన్ గురించి వివరించి, చట్టబద్ధమైన కనెక్షన్ లేకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు లైన్ మెన్. పోలీసు సిబ్బంది విద్యు్త్ సరఫరా పునరుద్ధరించాలని కోరినప్పటికీ లైన్‌మెన్ నిరాకరించాడు. సరైన కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీసులకు సూచించాడు. తరువాత పోలీసు సిబ్బంది చట్టబద్ధమైన విద్యుత్ కనెక్షన్ కోసం అప్లై చేసుకుంటామని చెప్పారు.
హెల్మెట్ ధరించకపోవడంతో లైన్ మెన్ కు రెండుసార్లు చలాన్లు వేశామని అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జ్ యోగేంద్ర సింగ్ తెలిపారు. అయితే, అవుట్‌పోస్టుకు అధికారిక విద్యుత్ కనెక్షన్ లేదని, నిబంధనల ప్రకారం లైన్‌మెన్ విద్యుత్ సరఫరాను నిలిపివేశాడని అంగీకరించారు. విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖకు దరఖాస్తు సమర్పించినట్లు ఆయన తెలిపారు.
Also Read: రైలులో సీటు కోసం.. ఇద్దరు మహిళలు కుమ్మేసుకున్నారు, వీడియో వైరల్
విద్యుత్ శాఖ సబ్-డివిజనల్ అధికారి జితేంద్ర కుమార్ పోలీస్ అవుట్‌పోస్టుకు అధికారిక విద్యుత్ కనెక్షన్ లేదని తెలిపారు. చలాన్ల విషయంలో లైన్‌మెన్, పోలీసు సిబ్బంది మధ్య వాదన జరిగి ఉండవచ్చని, ఆ తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. అవుట్ పోస్టు సిబ్బంది విద్యుత్ కనెక్షన్ కోసం అప్లై చేసుకున్నారన్నారు. కనెక్షన్ అధికారికంగా ఆమోదం పొందిన తర్వాతే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు.