E-Paper
Advertisement

Meesaala Pilla Song: ‘మీసాల పిల్ల’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూసేయండిక!

Meesaala Pilla Song: ‘మీసాల పిల్ల’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూసేయండిక!
Advertisement

Meesaala Pilla Song: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా దూసుకెళుతున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దిశగా దూసుకెళుతున్న ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా నాల్గవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మూడో వారం కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ ఆశాజనకంగానే ఉండటం విశేషం. ఈ సినిమాతో పాటు వచ్చిన సినిమాలన్నీ దుకాణం సర్దేశాయి. ‘ది రాజా సాబ్’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలు విడుదలైన రోజే మిశ్రమ టాక్‌ని సొంతం చేసుకోవడంతో, కలెక్షన్ల విషయంలో వెనుకబడ్డాయి. అదే సమయంలో ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రారంభమై, ఆ చిత్రాలకు తగ్గ కలెక్షన్స్‌ని రాబట్టి, లాభాల బాట పట్టాయి.

Also Read- Nagabandham: ఆ పండగ రోజే.. పాన్ ఇండియా ఫిల్మ్ ‘నాగబంధం’ టీజర్‌కు డేట్ ఫిక్స్!

‘మీసాల పిల్ల’ వచ్చేసింది

Advertisement

‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు కనుక సంక్రాంతి పోటీలో కాకుండా విడివిడిగా వచ్చి ఉంటే, ఇంకా భారీగా కలెక్షన్స్‌ని రాబట్టేవి. భారీ పోటీ మధ్య విడుదలవడంతో సరిగ్గా థియేటర్లు లభించిక, ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్‌పై పడింది. గత వారం కొన్ని కొత్త సినిమాలు విడుదల కావడంతో చాలా వరకు థియేటర్లలో ఈ సినిమాలను లేపేశారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మాత్రం లాంగ్ రన్ దిశగానే దూసుకెళుతోంది. ఈ చిత్రంపై ఇంకా ఇంకా ఇంట్రస్ట్ పెంచేలా, మేకర్స్ వీడియో సాంగ్స్‌ని వదలడం మొదలెట్టారు. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ అన్నీ మంచి ఆదరణను రాబట్టుకోగా, సినిమా విడుదలకు ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన ‘మీసాల పిల్ల’ ఫుల్ వీడియో సాంగ్‌ (Meesaala Pilla Video Song)ని సోమవారం మేకర్స్ వదిలారు. ఇప్పుడీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Couples Fights: దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలా? బెడ్‌రూమ్‌లో ఇలాంటి ఫోటోలు ఉంచి చూడండి!

ఓటీటీ హక్కులు ఆ సంస్థకే..

Advertisement

ఈ పాటలో మెగాస్టార్ స్టెప్స్ గురించి అంతా మరోసారి మాట్లాడుకుంటున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ డ్యాన్స్, గ్రేస్‌లో ఏం మార్పు రాలేదనేలా.. ఈ పాటలో చిరంజీవి అలరించారు. చిరంజీవి, నయనతార (Nayanthara)ల జోడీ చాలా బాగుందనే ఫీల్‌ని కూడా ఈ పాటే ప్రేక్షకులకు కల్పించింది. మరి ఇంకెందుకు ఆలస్యం, పాటను చూసేయండిక. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న ఈ చిత్రం విడుదలైంది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జీ5 సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.

Also Read- Ranabaali: ‘రణబాలి’ టైటిల్ గ్లింప్స్.. విజయ్ దేవరకొండ క్రేజ్‌పై డౌట్స్!

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×