E-Paper
Advertisement

Revanth Reddy: వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్న వాళ్లు.. ఉద్యమకారులు, జాతిపితలా.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

Revanth Reddy: వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్న వాళ్లు.. ఉద్యమకారులు, జాతిపితలా..  సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
Advertisement

Revanth Reddy: హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నిజాం పాలకుల అరాచకాలను ఎదిరించి, తనకున్న 500 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన రావి నారాయణ రెడ్డి స్ఫూర్తిని కొనియాడారు. దేశపు మొట్టమొదటి పార్లమెంటు ఎన్నికల్లో నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన యోధుడు రావి నారాయణ రెడ్డి అని, అటువంటి మహనీయుల పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని న్యాయకోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అందించడం ఈ అవార్డుకే గౌరవమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు. రావి నారాయణ రెడ్డి వంటి వారు పదవుల కోసం పాకులాడకుండా 60 ఏళ్లకే ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారని, కానీ నేటి తరం నాయకులు ప్రజలు తిరస్కరించినా పదవుల కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన వాళ్లను ఉద్యమకారులంటారని, కానీ ఇక్కడ మాత్రం వందల ఎకరాల ఫాంహౌస్‌లు, టీవీ ఛానళ్లు, పేపర్లు, వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్న వాళ్లు తమను తాము ఉద్యమకారులుగా, జాతిపితలుగా ముద్ర వేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

Advertisement

ఇటీవల కేసీఆర్ నివాసంలో జరిగిన సిట్ (SIT) విచారణ అంశంపై స్పందిస్తూ, చేసిన తప్పులకు నోటీసులు ఇస్తే అది తెలంగాణ జాతికి జరిగిన అవమానంగా చిత్రీకరించడం సరికాదన్నారు. “రావి నారాయణ రెడ్డి గారు ప్రజల కోసం ఆస్తులు పంచారు, వీరు మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారు” అని ధ్వజమెత్తారు. అధికారం ఉన్నప్పుడు ప్రొఫెసర్ కోదండరాం వంటి ఉద్యమకారుల ఇంటి తలుపులు బద్దలు కొట్టించి జైలుకు పంపినప్పుడు మీ ఉద్యమ స్ఫూర్తి ఏమైందని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా జరిగే విచారణలను ఎవరైనా ఎదుర్కోవాల్సిందేనని, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది ప్రజాప్రతినిధులకు తప్ప క్రిమినల్ నేరాలకు కాదని ఆయన నొక్కి చెప్పారు.

గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, యడ్యూరప్ప వంటి పెద్ద నేతలే విచారణలను ఎదుర్కొని కోర్టు మెట్లెక్కారని, కేసీఆర్ మాత్రం తాను దైవాంశ సంభూతుడిలా ఫీల్ అవ్వడం హాస్యాస్పదమని అన్నారు. “నేనే రాజ్యం.. రాజ్యమే నేను” అనుకునే మధ్యయుగపు చక్రవర్తుల ఆలోచనా ధోరణిని వీడాలని హితవు పలికారు. ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీలో ఓడించారు, పార్లమెంటులో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలని, ప్రజా తీర్పును గౌరవించి కుందాగా తప్పుకుంటే గౌరవం ఉంటుందని సూచించారు. కమ్యూనిస్టులు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ వాటిని చట్టాలుగా మార్చిందని, పేదలకు భూమి, అడవి బిడ్డలకు హక్కులు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ దని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వివరించారు.

Advertisement

భారతీయ జనతా పార్టీ లక్ష్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అనే నినాదం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ‘వన్ పర్సన్.. వన్ పార్టీ’ విధానాన్ని తీసుకురావడమే బీజేపీ అసలు ఉద్దేశమని విమర్శించారు. రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలనే దురాలోచనతోనే గత ఎన్నికల్లో వారు 400 సీట్లు అడిగారని, అయితే దేశ ప్రజలు వారి కుతంత్రాన్ని గమనించి సింపుల్ మెజార్టీ కూడా ఇవ్వకుండా గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. సామాన్యుడి ఓటు హక్కును కాలరాయడానికి ‘SIR’ పేరిట సరికొత్త ప్లాన్ చేస్తున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Read Also:  హైదరాబాద్ టు బెంగళూరు.. కేవలం 2 గంటలే.. తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ కానుకలు..

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×