Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 మొదలయ్యి ఇప్పటికీ 64 రోజులు అయిపోయింది. అయితే ఈ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో భరణి ఒకరు. భరణి మీద స్టార్టింగ్ నుంచి అందరికీ మంచి ఒపీనియన్ ఉండేది. చాలామంది కూడా బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. మొదటిలో తన గేమ్ కూడా అందరిని ఆకర్షించింది.
ఎప్పుడైతే తనుజ భరణిను నాన్న అని పిలవడం మొదలుపెట్టిందో అక్కడి నుంచి ఎమోషనల్ బాండింగ్ తనుజాత పెంచుకున్నాడు భరణి. ఆ తర్వాత దివ్య కూడా హౌస్ లోకి ఎంటర్ ఇచ్చింది. తర్వాత భరణికి దివ్యకి మధ్య మంచి బాండింగ్ కొన్ని రోజులు నడిచింది. అయితే ఈ బంధాల వలనే భరణి బయటికి వెళ్లిపోయాడు అనే కామెంట్స్ వినిపిస్తూనే వచ్చాయి. అయితే ఈ వారం నామినేషన్స్ లో భరణి ఆశ్చర్యకరంగా దివ్యాను నామినేట్ చేశాడు.
చాలామంది నామినేట్ చేసినప్పుడు అంతా నా కూడా గేమ్ కనిపించడం లేదు అని అంటున్నారు. నేను గేమ్ ఆడకుండా ఐదుసార్లు కెప్టెన్సీ కంటెండర్ షిప్ లోకి రాను. నా గేమ్ ఆడకుండా నేను ఎక్కడా లేను నా గేమ్ నేను ఆడుతున్నాను. నేను హౌస్ నుంచి బయటికి వెళ్లడానికి కారణం నువ్వు అని చాలామంది అంటున్నారు దివ్య. నాకు కూడా ఆ డౌట్ ఉంది. అది తప్పు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నీకు ఉంది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అని భరణి చెప్పాడు.
భరణి ఆ మాటలు చెప్పడంతో నేను హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి ఇది రీజన్ గా చెప్పి నామినేట్ చేస్తున్నారా అని అడిగింది. అంతేకాకుండా నా వలన మీరు బయటకు వెళ్ళిపోలేదు అని ప్రూవ్ చేసుకుంటూనే వచ్చాను అని గట్టిగా మాట్లాడింది దివ్య. అయితే ఆర్గ్యుమెంట్ కి కేవలం ఐదు నిమిషాల టైం మాత్రమే ఇవ్వడంతో తర్వాతగా ఆపేయాల్సి వచ్చింది.
అయితే భరణి దివ్యా ను నామినేట్ చేసిన తర్వాత చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడి నుంచి భరణి గేమ్ మారుస్తున్నాడు అనే ఫీలింగ్ చాలా మందికి వచ్చింది. అయితే భరణి ఇకపై అసలైన గేమ్ ఆడుతాడా అనేది చూడాలి. దివ్య ను నామినేట్ చేయడం అనేది ఒక రకంగా భరణికి వచ్చిన రియలైజేషన్. మరోవైపు రీతు కూడా దివ్య ను నామినేట్ చేసింది. అందర్నీ తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నావ్ అంటూ దివ్య రీజన్ చెప్పింది.
Also Read: Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు