Narne Nithin: మ్యాడ్ సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు నార్నే నితిన్(Narne Nithin). మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన అనంతరం ఆయ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే త్వరలోనే మ్యాడ్ 3 కూడా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇలా నితిన్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఈయన కొత్త సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నితిన్ మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యారని సమాచారం. ఇటీవల కిరీటి రెడ్డి(Kireeti Reddy) హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జూనియర్ సినిమా(Junior Movie) మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడిగా రాధాకృష్ణారెడ్డి(Radhakrishna Reddy) పనిచేశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో నటుడు నార్నే నితిన్ తో కలిసి మరో సినిమా చేసే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఇండస్ట్రీ సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ఏ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, ఇందులో హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరనే విషయాలు గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల నితిన్ వరుస సినిమాలలో నటిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు మరోవైపు రాధాకృష్ణారెడ్డి కూడా జూనియర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో కొత్త సినిమా అంటేనే మరో హిట్ సినిమా రాబోతోందని చెప్పాలి. ఇక నార్నే నితిన్ ప్రస్తుతం మ్యాడ్ 3 సినిమా షూటింగ్ పనులతో పాటు కొత్త సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నార్నే నితిన్…
ఇకపోతే ఈయన ఇటీవల వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా నితిన్ శివానిల వివాహం అక్టోబర్ 10వ తేదీ ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహపు వేడుకలో భాగంగా పలువురు సినిమా సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఇక పెళ్లి పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో నితిన్ గత కొద్ది రోజులుగా సినిమా షూటింగ్లకు దూరంగా ఉన్నారు. త్వరలోనే ఈయన తిరిగి షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈయన లక్ష్మీ శివాని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read: Trivikram -Venkatesh: త్రివిక్రమ్ వెంకీ సినిమాకు వెరైటీ టైటిల్… కరెక్ట్ గానే సూటయిందే!