BigTV English

Director Teja : బుర్ర లేని డైరెక్టర్ లతో పని చేయడం వల్ల నేను డైరెక్టర్ అయ్యాను

Director Teja : బుర్ర లేని డైరెక్టర్ లతో పని చేయడం వల్ల నేను డైరెక్టర్ అయ్యాను

Director Teja : ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించారు కానీ ఒకప్పుడు ఉన్న సంచలనమైన దర్శకులకు పేర్లు ప్రస్తావన లోకి వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు తేజ. జీవితంలో తేజ ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చారు. ఈ స్థాయికి వచ్చినా కూడా తన మూలాలను మర్చిపోలేదు కాబట్టి ప్రతి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడే విధానం చాలామందికి విపరీతంగా నచ్చుతుంది. గట్టిగా మాట్లాడితే తేజ సినిమాల కంటే కూడా తేజ ఇంటర్వ్యూలను కూడా ఇష్టపడే వాళ్ళు ఎక్కువమంది ఉన్నారు.


ఇకపోతే కెమెరా అసిస్టెంట్ గా జాయిన్ అయిన తేజ తర్వాత కాలంలో సినిమాటోగ్రాఫర్ గా మారారు. అలానే రాంగోపాల్ వర్మ చేసిన శివ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. మొత్తానికి చిత్రం అనే సినిమాతో తేజ కూడా దర్శకుడుగా మారిపోయాడు. చిత్రం సినిమా అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్. ఉదయ్ కిరణ్ ఆ సినిమాతో స్టార్ అయిపోయాడు. కేవలం ఉదయ్ కిరణ్ మాత్రమే కాకుండా చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత తేజకు ఉంది.

బుర్ర లేని డైరెక్టర్ తో పనిచేయటం 

తేజ విషయానికొస్తే సినిమాటోగ్రాఫర్ గా ఉన్న తేజ దర్శకుడుగా మారడానికి కారణాలేంటి అనేది పెద్దగా ఎక్కువ మందికి తెలియదు. కానీ అసలు విషయం ఏంటంటే సినిమాటోగ్రాఫర్ గా చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో తేజ వర్క్ చేశాడు. మహేష్ బట్, రాంగోపాల్ వర్మ వంటి దిగ్గజ దర్శకులతో పాటు సినిమా మీద కనీస అవగాహన లేని కొంతమంది దర్శకలతో కూడా పనిచేశాడు. అటువంటి దర్శకులను చూసినప్పుడే తేజకు మనమే డైరెక్టర్ అవ్వాలి అనే ఆలోచనలు వచ్చేవట.


అమితాబ్ బచ్చన్ ప్రొడ్యూసర్ గా తేరే మేరే సప్నే అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. 1996లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు ku పెద్దగా ఏమీ తెలియదు. తేజ నువ్వు సినిమా చేయాలి అని పిలిచినప్పుడు కథను విన్నారట. తేజ కథ విన్న తర్వాత అమితాబ్ బచ్చన్ కి ఫోన్ చేసి. సర్ కథ అంతగా ఏమీ బాలేదు మనం సినిమా చేయడం ఆపేస్తే బాగుంటుంది అని చెప్పారట

చెయ్యక తప్పదు 

మనం ఈ సినిమాను అనౌన్స్ చేసేసాము. చాలామంది కొత్త యాక్టర్లు ఈ సినిమాలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా చేయాల్సిందే. కథ బాలేదు అంటున్నావ్ కాబట్టి నీకు కథ పట్ల అవగాహన ఉంది అని నాకు తెలుసు. నువ్వు కథను సరి చేయమని చెప్పారట. వెంటనే ఆ పని కూడా చేశాడు తేజ.

కథ మొదలైన తర్వాత దర్శకుడు షూటింగ్ కు రావడానికి వెనకడుగు వేశాడు. మళ్లీ తేజకు జయ బచ్చన్ నుంచి ఫోన్ వచ్చింది. దర్శకుడు సెట్ లోకి రావడానికి భయపడుతున్నాడు నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పారట. వెంటనే కథ కాకుండా ముందు సాంగ్స్ ప్లాన్ చేశాడు తేజ.

అలా సాంగ్స్ ప్లాన్ చేయడం వలన దర్శకుడికి కూడా కొద్దిగా సెట్ అలవాటు పడింది. అయితే ఒక సీన్ బాగా వచ్చినా కూడా మళ్లీ రీటెక్ అడిగాడు దర్శకుడు. బానే వచ్చింది కదా రీటెక్ ఎందుకు అని అడిగాడు తేజ. లేదు సీన్ నరేషన్ లో ఉన్నప్పుడు ఈ డైలాగ్ కేవలం 29 సెకండ్లే ఉంది. ఇక్కడ మాత్రం 33 సెకండ్లు చెప్పారు. అందుకే రీటెక్ అన్నారట.

సీన్ నువ్వు చూస్తున్నావ్ 

రీ టేక్ లో కూడా ఈ దర్శకుడు స్టాప్ వాచ్ చూడడం మొదలు పెట్టాడు. ఈసారి కరెక్టుగా 29 సెకండ్లు డైలాగ్ అయిపోయింది. టేక్ ఓకే చేశాను డైరెక్టర్. నువ్వు అనుకున్న ఎమోషన్ వచ్చిందో లేదో చూడలేదు కదా అన్నాడు తేజ. నువ్వు కెమెరాలో చూస్తున్నావు కదా అన్నాడు ఆ దర్శకుడు. కట్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దర్శకుడికి లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారు. తేజకు 8 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారు.

ఇలాంటి పరిణామాలు తేజ జీవితంలో జరగడం వలన చిత్రం అనే కథను రాసి, రామోజీరావుకి చెప్పి సినిమా పట్టాలెక్కించాడు. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ తేజ సూపర్ హిట్ దర్శకుడు.

Also Read: Telusu Kada : తెలుసు కదా సెన్సార్ పూర్తి , డ్యూరేషన్ ఎంతంటే?

Related News

Prabhas : నెక్స్ట్ ఇయర్ కు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్, రెండు సినిమాలు సిద్ధం

Akhanda2 Thaandavam : థియేటర్స్ లో శివతాండవం, తమన్ మామూలోడు కాదు

AA 22xA6: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..  ఇండస్ట్రీలోనే రికార్డు!

Samantha: సమంత ఇంట ప్రత్యేక పూజలు..అదే కారణమా… ఫోటోలు వైరల్!

Devi Sri Prasad: దేవీశ్రీ ఎక్కడ? కొంపదీసి ఇండస్ట్రీ దూరం పెడుతోందా?

Jai hanuman: జై హనుమాన్ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్.. ఎదురుచూపులు తప్పవా?

Akhanda 2: రంగంలోకి పండిట్ ద్వయం..హైప్ పెంచేసిన తమన్!

Big Stories

×