Justice For Srija Dammu : బిగ్ బాస్ సీజన్ 9 ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అతనికి ఈ సీజన్ 5 వారాలు పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్ అవుతుంది అని అందరికీ తెలిసిపోయింది. ఫ్లోరా ఎలిమినేట్ అయితే ఇప్పటివరకు మొత్తం ఇద్దరు సెలబ్రిటీలు బయటకు వచ్చేసినట్టు.
ముగ్గురు కామనర్స్ ఆల్రెడీ బయటకు వచ్చేసారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైనట్లయితే ఈరోజు ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం అవుతుంది. శ్రీజా దమ్ము ఎలిమినేట్ అయిపోయి శివాజీతో బజ్ ఇంటర్వ్యూ కూడా చేసినట్లు తెలుస్తుంది. మామూలుగా అయితే సంజనా లాగా హౌస్ నుంచి బయటికి పంపించేసి సీక్రెట్ రూంలో ఉంచుతారులే అని అందరూ ఊహించొచ్చు. కానీ శివాజీ తో బజ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది అంటే ఇంక బయటికి వెళ్లిపోయినట్లే.
శ్రీజ దమ్ము అనవసరమైన విషయాల్లో దూరి గోల చేస్తుంది అని అందరికీ తెలుసు. కొన్ని విషయాల్లో తన గొంతు వింటే కంపరంగా కూడా అనిపించేది. అని వాస్తవం ఏంటంటే తను లేకపోతే హౌస్ లో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. కొన్ని విషయాల్లో తను అడ్డదిడ్డంగా వాదించిన కూడా అదే ఎంటర్టైన్మెంట్. అయితే శ్రీజ ఎలిమినేట్ అని ఇప్పటివరకు ఎవరికీ అవగాహన లేదు. కానీ ఒక స్ట్రాటజీ వలన సుమన్ శెట్టి, పవన్, సృజను బయటకు పంపాల్చి వచ్చిందని, అందుకే శ్రీజ బయటకు పంపించేశారు అనేది న్యూస్. మామూలుగా అయితే దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఎక్కడ విడుదల కాలేదు. ఇదే ట్విస్ట్.
మరోవైపు ఈ వార్త బయటకు వచ్చిందో లేదో సోషల్ మీడియాలో శ్రీజ సపోర్ట్ గా చాలా న్యూస్ వస్తున్నాయి. కొంతమంది విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. శ్రీజ స్ట్రాంగ్ ప్లేయర్. ఐదు వారాల నుంచి ఆమె ఎంత బాగా ఆడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఆమె హౌస్ లో ఉండటం అవసరం అనేది కొంతమంది అభిప్రాయం.
ఒకవేళ శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయిపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తనని హౌస్ లోకి తీసుకురావాలి అనేది చాలామంది నుంచి వస్తున్న వాదన. బిగ్బాస్ చరిత్రలో ఇప్పటివరకు బయటకు వచ్చేసిన వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్లలేదు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది. శ్రీజ అసలు బయటకు వచ్చేసిందా? ఏం జరగబోతుంది ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే. అలానే ఈరోజు ఎపిసోడ్ లో కొత్తగా ఆరుగురు కామనర్స్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
Also Read: Director Teja : బుర్ర లేని డైరెక్టర్ లతో పని చేయడం వల్ల నేను డైరెక్టర్ అయ్యాను