Srikanth Iyengar:ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) తాజాగా చేసిన తప్పును ఒప్పుకుంటూ తన ఇంస్టాగ్రామ్ అధికారిక ఖాతా ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ మేరకు.. “నేను చేసిన వ్యాఖ్యలతో ఎంతోమంది బాధపడ్డారని తెలిసింది. వారందరినీ నేను క్షమించమని కోరుతున్నాను. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు విడిచారు కదా.. వారందరినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకి ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి మనల్ని విడదీయకుండా నేను చూసుకుంటాను. అభివృద్ధిలో మనమంతా కలిసి ముందుకు సాగుదాం” అంటూ అపాలజీ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అదే రోజు దసరా కావడంతో సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్లు కూడా వెలిశాయి. పైగా ఇదే విషయంపై రెండు, మూడు వీడియోలలో గాంధీని తిట్టడంతో కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manchu Vishnu) ని కలిసి శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలి అంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు దిగివచ్చిన శ్రీకాంత్ ఇలా క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు.
అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీని ఉద్దేశిస్తూ.. “స్వాతంత్రం గాంధీ తీసుకురాలేదు. అది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వీరుల త్యాగఫలం. మహాత్ముడు అని చెబుతున్న గాంధీ ఎంతోమందిని లైంగికంగా వేధించాడని చరిత్ర కూడా చెబుతోంది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా..” నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తాయి. వాటిని పట్టించుకోను. గాంధీ గురించి నేను చెప్పింది నిజమే” అంటూ ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. “ముఖ్యంగా గాంధీ స్వాతంత్రం తెచ్చాడు అన్నది పచ్చి అబద్ధం. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి లక్షల మంది ప్రాణాలు అర్పిస్తేనే మనకు స్వాతంత్రం వచ్చింది. మేం భరతమాత బిడ్డలం. ఆయన జాతిపిత ఏంటి? ఆయన జాతిపిత అయితే నేను బాస్టర్డ్ సిటిజన్” అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. మహాత్ముడి పై అన్నేసి మాటలు అనడానికి నీకు ఎలా నోరు వచ్చిందని కొంతమంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరి కొంతమంది గాంధీజీ గురించి శ్రీకాంత్ చెప్పింది నిజమేగా అంటూ మద్దతు పలుకుతున్నారు. మొత్తానికి అయితే ఈ వివాదం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది
ALSO READ:Tollywood: జూబ్లీహిల్స్ లో సందడి చేసిన సింగర్ సునీత.. వాటికే అందం తెస్తూ!
?utm_source=ig_web_copy_link