Jai hanuman: కన్నడ సినీ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishabh Shetty)ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కొనసాగుతున్న ఈయన కాంతార సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న రిషబ్ ఈ సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి మొదటి వారంలోనే 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో రిషబ్ శెట్టి కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు జై హనుమాన్(Jai Hanuman) సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా నటించిన చిత్రం హనుమాన్(Hanuman). ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబడుతూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా “జై హనుమాన్” సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉంటున్నారు.
ఇక ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటుడు రిషబ్ శెట్టి నటించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఈయన మాట్లాడుతూ.. జై హనుమాన్ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జనవరి నుంచి ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా ఈ సినిమా విడుదల సమయానికి తాను పూర్తిగా తెలుగు నేర్చుకుని తెలుగులోనే మాట్లాడతానని తెలిపారు. ఇటీవల కాంతార 1 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈయన కన్నడ మాట్లాడటంతో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జై హనుమాన్ సినిమా సమయానికి తాను తెలుగు నేర్చుకుంటానని తెలిపారు.
రెండేళ్లు ఎదురుచూడాల్సిందే..
ఇకపోతే కాంతార సీక్వెల్ సినిమా గురించి కూడా ఈయన ఈ సందర్భంగా స్పందించారు. తనకు నటుడిగా నటించడం చాలా ఇష్టం కానీ దర్శకత్వం మాత్రం వేరే సంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. అయితే తన దర్శకత్వంలో రాబోయే సినిమాకి మరో రెండు సంవత్సరాల సమయం పడుతుందంటూ ఈ సందర్భంగా రిషబ్ శెట్టి చెప్పడంతో కచ్చితంగా కాంతార 2 సినిమా గురించే ఈయన మాట్లాడారని ఈ సినిమా కోసం మరో రెండు సంవత్సరాల పాటు ఎదురుచూపులు తప్పవని అభిమానులు రిషబ్ శెట్టి వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. ఇక కాంతార సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈయనకు ఇతర భాషలలో కూడా అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Narne Nithin: జూనియర్ డైరెక్టర్ తో మ్యాడ్ హీరో.. మరో హిట్ లోడింగ్?