Fishermen Vs Police: అనకాపల్లి జిల్లా నక్కపల్లి హైవే దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బల్క్ డ్రగ్స్ పార్కు నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని మత్స్యకారులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతంగా మారింది. రహదారికి ఇరువైపుల నిరసనకి దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్లని వదిలిపెట్టాలని రామ చంద్ర యాదవ్ వచ్చేందుకు పోలీసులు అనుమతి అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులతో చర్చించేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు జాతీయ రహదారి వద్దకి చేరుకుంటున్నారు.
అక్కడి నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయం సమీపంలో.. ఆందోళనల తీవ్రత ఎక్కువయి, జిల్లా కలెక్టర్ విజయం కృష్ణన్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి నిర్ణయాలపై చర్చించే ప్రయత్నం చేయగా, మత్యకారులు కలెక్టర్ వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపమని నిరాకరించారు. సుమారు 10 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
మత్యకారులకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, సీపీఎం నాయకుడు అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై నిరసనకారులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నాయకుల రాకను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు. దీంతో ఆందోళన మరింత ఉధృతమైంది.
మత్యకారులు నక్కపల్లి ఎస్‌ఐ సన్నిబాబును వెంటనే సస్పెండ్ చేయాలని, హోం మంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: పాడుబడ్డ బంగ్లాలో డ్రగ్స్ తీసుకుంటూ.. ఇద్దరు యువకులు అరెస్ట్
ఉద్రిక్తతతో జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు రెండువైపులా లారీలు, బస్సులు, కార్లు నిలిచి ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించే ప్రయత్నం చేసినా, పరిస్థితి అదుపులోకి రాలేదు.