BigTV English

Samantha: సమంత ఇంట ప్రత్యేక పూజలు..అదే కారణమా… ఫోటోలు వైరల్!

Samantha: సమంత ఇంట ప్రత్యేక పూజలు..అదే కారణమా… ఫోటోలు వైరల్!

Samantha: సినీనటి సమంత(Samantha) ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సమంత ఖుషీ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. అనంతరం ఈమె తన నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శుభం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. అయితే ఇటీవల సమంత సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి. ఇలా సినిమాలను తగ్గించిన సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.


ప్రత్యేక పూజలలో సమంత..

ఇకపోతే సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు చూస్తుంటే మాత్రం తన గృహప్రవేశానికి(House Warming) సంబంధించిన ఫోటోలని స్పష్టమవుతుంది. తన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేసారు. అనంతరం తన ఇంటిని పువ్వులతో చాలా అందంగా ముస్తాబు చేసిన ఫోటోలను షేర్ చేయడంతో కచ్చితంగా ఈ ఫోటోలు గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలేనని అభిమానులు భావిస్తున్నారు. ఇక సమంత ట్రెడిషనల్ డ్రెస్సులో ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

న్యూ బిగినింగ్స్…

సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. అయితే ఈ గృహప్రవేశం అక్టోబర్ 2వ తేదీనే జరిగిందని, అక్టోబర్ రెండో తేదీ ఈమె తన ఇంటి ఫోటోలను షేర్ చేస్తూ న్యూ బిగినింగ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. తాజాగా ఈ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా సమంత కొత్త ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సమంత త్వరలోనే మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు. తన సొంత నిర్మాణ సంస్థలోనే డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.


ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన సమంత మరొక డైరెక్టర్ రాజ్ నిడుమోరి(Raj Nidumori)తో కలసి ప్రేమలో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి జంటగా విదేశాలలో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఇద్దరు మాత్రం ఈ వార్తలను ఎక్కడ ఖండించలేదు. మరి సమంత రాజ్ రిలేషన్ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే వీరు స్పందించాల్సి ఉంటుంది. ఇక సమంత మా ఇంటి బంగారం సినిమాతో పాటు, పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Also Read: Jai hanuman: జై హనుమాన్ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్.. ఎదురుచూపులు తప్పవా?

Related News

Prabhas : నెక్స్ట్ ఇయర్ కు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్, రెండు సినిమాలు సిద్ధం

Akhanda2 Thaandavam : థియేటర్స్ లో శివతాండవం, తమన్ మామూలోడు కాదు

AA 22xA6: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..  ఇండస్ట్రీలోనే రికార్డు!

Director Teja : బుర్ర లేని డైరెక్టర్ లతో పని చేయడం వల్ల నేను డైరెక్టర్ అయ్యాను

Devi Sri Prasad: దేవీశ్రీ ఎక్కడ? కొంపదీసి ఇండస్ట్రీ దూరం పెడుతోందా?

Jai hanuman: జై హనుమాన్ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్.. ఎదురుచూపులు తప్పవా?

Akhanda 2: రంగంలోకి పండిట్ ద్వయం..హైప్ పెంచేసిన తమన్!

Big Stories

×