BigTV English

Trivikram -Venkatesh: త్రివిక్రమ్ వెంకీ సినిమాకు వెరైటీ టైటిల్… కరెక్ట్ గానే సూటయిందే!

Trivikram -Venkatesh: త్రివిక్రమ్ వెంకీ సినిమాకు వెరైటీ టైటిల్… కరెక్ట్ గానే సూటయిందే!

Trivikram -Venkatesh: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ (Venkatesh)సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా ఇటీవల రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం వెంకీ 77 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ తో సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి.


అబ్బాయి గారికి 60 ప్లస్..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి ఆనందరావు, ఆనంద నిలయం, వెంకటరమణ వంటి టైటిల్స్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా మరో టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. ఈ సినిమా కూతురివిక్రమ్ శ్రీనివాస్ “అబ్బాయి గారికి 60 ప్లస్” (Abbayigariki 60 Plus)అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దాదాపు ఇదే టైటిల్ కూడా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమా కథకు అనుగుణంగా ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని చిత్ర బృందం భావిస్తున్నట్టు సమాచారం.

త్రివిక్రమ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా..

ఈ క్రమంలోనే వెంకటేశ్ త్రివిక్రమ్ సినిమాకు అబ్బాయి గారికి 60 ప్లస్ టైటిల్ పెట్టబోతున్నారని వార్తలు బయటకు రావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ టైటిల్ విన్నటువంటి అభిమానులు టైటిల్ చాలా క్రేజీగా ఉంది అంటూ కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం వెంకటేష్ సినిమాకు కరెక్ట్ గా సరిపోతుంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమాకు చివరికి ఎలాంటి టైటిల్ ప్రకటిస్తారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాసు తన ‘అ’ సెంటిమెంట్ ఫాలో అయ్యారనే చెప్పాలి.


వెంకీ మామకు జోడిగా శ్రీనిధి శెట్టి?

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఎక్కువగా ‘అ’ అనే అక్షరంతోనే మొదలవుతాయనే విషయం తెలిసిందే. ఇలా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అతడు, అ,ఆ, అలా వైకుంఠపురములో, అత్తారింటికి దారేది వంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో వెంకటేష్ సినిమాకు ఈ టైటిల్ అయితే ఈ సినిమా కూడా పక్క బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరో నటించబోతున్నారనే విషయం పై ఇప్పటివరకు స్పష్టత రాలేదు కానీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సందడి చేయబోతున్నారంటూ వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై శ్రీనిధి శెట్టి స్పందిస్తూ ఇప్పటివరకు తనని ఎవరు కలవలేదని ఈ సినిమా కోసం నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా నటిస్తానని వెల్లడించారు.

Also Read: Kantara Chapter1: కదంబల కాలంలో ప్లాస్టిక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ రిషబ్!

Related News

Samantha: సమంత ఇంట ప్రత్యేక పూజలు..అదే కారణమా… ఫోటోలు వైరల్!

Devi Sri Prasad: దేవీశ్రీ ఎక్కడ? కొంపదీసి ఇండస్ట్రీ దూరం పెడుతోందా?

Jai hanuman: జై హనుమాన్ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్.. ఎదురుచూపులు తప్పవా?

Akhanda 2: రంగంలోకి పండిట్ ద్వయం..హైప్ పెంచేసిన తమన్!

Narne Nithin: జూనియర్ డైరెక్టర్ తో మ్యాడ్ హీరో.. మరో హిట్ లోడింగ్?

Srikanth Iyengar: దెబ్బకు దిగొచ్చిన శ్రీకాంత్ అయ్యంగార్.. క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్!

Kantara Chapter1: కదంబల కాలంలో ప్లాస్టిక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ రిషబ్!

Big Stories

×