BigTV English

AA 22xA6: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..  ఇండస్ట్రీలోనే రికార్డు!

AA 22xA6: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..  ఇండస్ట్రీలోనే రికార్డు!

AA 22xA6: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. పుష్ప సినిమా(Pushpa Movie) ద్వారా ఈయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారంటూ చిత్ర బృందం వెల్లడించడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.


రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్..

ఇక ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక డైరెక్టర్ అట్లీ ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ సినీ హిస్టరీలోనే ఈ స్థాయిలో ఎవరు రెమ్యూనరేషన్ అందుకోలేదని చెప్పాలి. ఇప్పటివరకు ప్రభాస్ అత్యధికంగా ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

ఆ విషయంలో ప్రభాస్ ను మించిపోయిన బన్నీ..

తాజాగా అల్లు అర్జున్ , అట్లీ సినిమా కోసం ప్రభాస్ ను మించి రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా కోసం 175 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు మన ఇండియా సినీ ఇండస్ట్రీలోనే ఎవరూ కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదని చెప్పాలి.


హాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు..

ఇలా అల్లు అర్జున్ తీసుకుంటున్న ఈ రెమ్యూనరేషన్ గురించి తెలిసిన అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మరింత గుర్తింపు సంపాదించుకుంటారని, పుష్ప అంటే నేషనల్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ అంటూ ఆయన డైలాగులతోనే కామెంట్లు చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ తీసుకుంటున్న ఈ రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే, మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక వంటి వారు నటించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయబోతుందంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇక ఈ విషయం గురించి చిత్ర బృందం ఎలాంటి అధికారక ప్రకటన వెల్లడించలేదు.

Also Read: Samantha: సమంత ఇంట ప్రత్యేక పూజలు..అదే కారణమా… ఫోటోలు వైరల్!

Related News

Prabhas : నెక్స్ట్ ఇయర్ కు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్, రెండు సినిమాలు సిద్ధం

Akhanda2 Thaandavam : థియేటర్స్ లో శివతాండవం, తమన్ మామూలోడు కాదు

Director Teja : బుర్ర లేని డైరెక్టర్ లతో పని చేయడం వల్ల నేను డైరెక్టర్ అయ్యాను

Samantha: సమంత ఇంట ప్రత్యేక పూజలు..అదే కారణమా… ఫోటోలు వైరల్!

Devi Sri Prasad: దేవీశ్రీ ఎక్కడ? కొంపదీసి ఇండస్ట్రీ దూరం పెడుతోందా?

Jai hanuman: జై హనుమాన్ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్.. ఎదురుచూపులు తప్పవా?

Akhanda 2: రంగంలోకి పండిట్ ద్వయం..హైప్ పెంచేసిన తమన్!

Big Stories

×