Akhanda 2: అఖండ 2.. ప్రముఖ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna).. ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల డిసెంబర్ 5కి వాయిదా పడింది. విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు చిత్రబృందం. అందులో భాగంగానే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఎస్. తమన్ (S. Thaman) ఈ సినిమా కోసం పండిట్ ద్వయాన్ని రంగంలోకి దింపుతున్నట్లు ఒక పోస్టు షేర్ చేశారు.
విషయంలోకి వెళ్తే.. ఇటీవలే అఖండ 2 నుంచి విడుదలైన టీజర్ అన్ని భాషలలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటు టీజర్ సినిమాకు మరో లెవెల్ క్రేజ్ ను అందించింది. మొదటి భాగానికి మించి ఈ సినిమా సక్సెస్ అందుకునేలా ఉందని ప్రేక్షకులు కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేయడానికి సిద్ధం అయ్యారు తమన్. అందులో భాగంగానే అదిరిపోయే అప్డేట్ అందించి ఊహించని బజ్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే అఖండ 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అధికారికంగా ఈరోజు ప్రారంభమయింది.
ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు తమన్. అంతేకాదు స్టూడియోలో పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రాతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. సౌండ్ ట్రాక్ లో భాగంగా సంస్కృత శ్లోకాలు ఆలపించేందుకు ఈ ఇద్దరు పండితులను తమన్ టీం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శ్లోకాలు, వేదశ్లోకాల పఠనానికి పేరుగాంచిన ఈ జంట.. ఇప్పుడు ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించనున్నారు. అఖండ 2 సంగీతాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి తమన్ చేస్తున్న ఈ ప్రయత్నం హైలైట్ అవుతోంది. మేకర్స్ కూడా ఈ సహకారాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సినిమా బిజిఎం అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. మొత్తానికైతే మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అయితే మాత్రం.. రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు. అసలే మొదటి పార్ట్ లో బిజిఎం ఏ రేంజ్ లో సినిమాకు హైలెట్గా నిలిచిందో అందరికీ తెలిసిందే. సీక్వెల్ లో అంతకుమించి స్కోర్ గూస్ 4 తెప్పించేలా ఉండబోతుందని తాజా స్టిల్స్ తో క్లారిటీ ఇచ్చేశారు తమన్.
అఖండ 2 సినిమా విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా, ఆది పినిశెట్టి కీలకపాత్రలో పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకం పై రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను రచనా, దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ కూతురు ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రాబోతున్న ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ALSO READ: Srikanth Iyengar: దెబ్బకు దిగొచ్చిన శ్రీకాంత్ అయ్యంగార్.. క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్!
The Pandit duo of Shravan Mishra and Atul Mishra are on board for #Akhanda2 background score ❤🔥@MusicThaman is leaving no stone unturned for making the score special 💥💥
Get ready for a goosebumps inducing score with divine chants ❤️🔥🔱
IN CINEMAS WORLDWIDE FROM DECEMBER… pic.twitter.com/M4fBLzg2Wt
— 14 Reels Plus (@14ReelsPlus) October 12, 2025