Devi Sri Prasad: సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు దేవిశ్రీప్రసాద్. ఉత్సాహభరితమైన సంగీతం, ఐకానిక్ పాటలతో శక్తివంతమైన నేపథ్య సంగీతానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) ఇప్పటికే అభిమానులకు తగ్గట్టుగా సంగీతాన్ని అందిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కూడా దేవిశ్రీప్రసాద్ కు గుండెల్లో స్థానం ఇచ్చారనటంలో సందేహం లేదు. అలాంటి ఈయనను ఇప్పుడు పరిశ్రమ దూరంగా పెడుతున్నట్లు అనిపిస్తోంది.
ముఖ్యంగా అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ తర్వాతే ఈ పరిస్థితి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ బహిరంగ కార్యక్రమాలలో స్పష్టమైన నిరాశ వ్యక్తం చేశారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో దర్శకుడు సుకుమార్ చివరికి తన సినిమాకి మ్యూజిక్ అందించడానికి శ్యామ్ CS ను తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన కథ అందరికీ తెలిసిందే. దీనికి తోడు ఇప్పటికే ఎన్నో బడా ప్రాజెక్టులు రావడం.. ఆ ప్రాజెక్టులలో డీఎస్పీ పేరు వినిపించకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు త్రివిక్రమ్ (Trivikram), వెంకటేష్ (Venkatesh) కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్టులో అయినా దేవిశ్రీప్రసాద్ భాగం అవుతారు అంటూ కొంతమంది ఊహాగానాలు వ్యక్తం చేసినా.. ఇప్పుడు అది కనిపించడం లేదు.
చివరిగా జూనియర్, కుబేర చిత్రాలకు పనిచేసిన దేవి శ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో అయిన దేవిశ్రీప్రసాద్ పేరు వినిపిస్తుందనుకున్నా.. ఇప్పుడు ఆయన పేరు వినిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే కొంతమంది దర్శకులు, నటులు ఉద్దేశపూర్వకంగానే దేవిశ్రీప్రసాద్ ను దూరం పెడుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి ఇది యాదృచ్ఛికంగా జరుగుతోందో లేక కావాలనే డీఎస్పీని దూరం పెడుతున్నారో తెలియదు కానీ.. ఈ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే దేవిశ్రీప్రసాద్ ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారేమో అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. డి.ఎస్.పి భారత సినిమాలో అత్యంత ప్రతిభావంతులైన స్వరకర్తలలో ఒకరిగా పేరు దక్కించుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు దక్కించుకున్న ఆయన గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి దేవిశ్రీప్రసాద్ కు ఎవరు అవకాశం కల్పిస్తారో చూడాలి. ఏది ఏమైనా ఒక దిగ్గజ సంగీత దర్శకుడికి ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు కరువవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.
గేయ రచయితగా, సంగీత స్వరకర్తగా, గాయకుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. రాక్ స్టార్ అనే బిరుదును దక్కించుకున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ్ , హిందీ సినిమాలలో చేసిన కృషికి గాను జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు నంది అవార్డు, 10 ఫిలింఫేర్ అవార్డులు, 8 సైమా అవార్డులు, ఐదు సినిమా అవార్డులతో పాటు అనేక ప్రశంసలు అందుకున్నారు.
also read: Akhanda 2: రంగంలోకి పండిట్ ద్వయం..హైప్ పెంచేసిన తమన్!