Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన ఎన్టీఆర్( NTR) ప్రస్తుతం పాన్ ఇండియా హీరో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈయన రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తదుపరి చిత్రాలన్నీ కూడా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అదేవిధంగా ఈయన బాలీవుడ్ సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వంలో హృతిక్ రోషన్(Hritik Roshan) హీరోగా నటిస్తున్న వార్ 2(War 2) సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.
రా ఏజెంట్ గా ఎన్టీఆర్..
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ పనులు కూడా ముగింపు దశకు వచ్చేసాయి. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ షూటింగ్ చేశారని తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ షూటింగ్ కి సంబంధించి ఒక పిక్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఫోటోలో ఎన్టీఆర్ కాస్త లేడీ గెటప్ లో కనిపించిన నేపథ్యంలో ఈయన లుక్ పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
లీక్ అయిన ఫోటో…
ఇలా ఎన్టీఆర్ లేడీ గెటప్ కి సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీగా విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమా అస్సామే అంటూ కామెంట్ చేయగా మరికొందరు ఈ గెటప్ ఏంది సామీ… అసలు మా హీరోతో ఏం చేయాలనుకుంటున్నావయ్య అంటూ డైరెక్టర్ పై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఇలాంటి గెటప్ లో కనిపించడానికి బహుశా సంబంధిత సన్నివేశాన్ని బట్టే అలా గెటప్ వేసారని తెలుస్తోంది. కానీ ఈ ఫోటోపై మాత్రం ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ భారీ స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఇలాంటి విషయాల పట్ల హీరోలపై విమర్శలు రావడం అనేది సర్వసాధారణమని చెప్పాలి.
కుమారస్వామిగా ఎన్టీఆర్
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో మరో యాక్షన్ మూవీ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలతో పాటు ఈయన దేవర 2, సినిమా చేస్తున్నారు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో కూడా ఒక సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాలో కుమారస్వామిగా కనిపించబోతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
Also Read: Star Hero: భార్యతో విడాకులు.. మద్యానికి బానిసైనా హీరో.. సూసైడ్ అటెంప్ట్ కూడా?