RGV Tweet to Stray Dog Lovers: వీధి కుక్క కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై డాగ్ లవర్స్ స్పందిస్తూ తీరుపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన తీరులో కౌంటర్స్ విసురుతున్నారు. డాగ్ లవర్స్ చురకలు అట్టిస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపిన వీడియోను షేర్ చేస్తూ.. పెట్ లవర్స్ ఒకసారి ఈ వీడియో చూడండి అంటూ గట్టి కౌంటరిచ్చారు. ఆ తర్వాత వీధి కుక్కలను రక్షించాలంటూ నిరసన చేస్తూ డాగ్ లవర్స్ అందరికి పది ప్రశ్నలు సంధించారు. ఇక ప్రశ్నలకు సమధానాలు కూడా ఆయన ఇచ్చారు.
వీధి కుక్కలను దత్తత తీసుకోండి..
వీధి కుక్కల విషయంలో పెట్ లవర్స్‌కి కొన్ని అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి… ఒక పని చేయండి.. ‘మీరు పేదలందరినీ దత్తత తీసుకుని మీ ఇళ్లకు తీసుకువచ్చి కుక్కల కోసం వీధులను ఎందుకు వదలేయకూడదు?’, ‘కుక్కలు మీ కుటుంబం లాంటివి అయితే, మీ లాబ్రడార్లు, హస్కీలు మొదలైన వాటికి వీధి కుక్కలతో పెళ్లి చేయొచ్చు కదా!’ కౌంటరిచ్చారు. అలాగే ‘కుక్కలను స్టెర్‌లైజ్ చేయడానికి బదులుగా.. డాగ్ లవర్స్ ఎమోషన్స్ మనమేందుకు స్టెర్‌లైజ్ చేయకూడదు? అలా చేయడం వల్ల వారి కరుణ మరింత పెరుగుతుంది.’, ‘డాగ్ లవర్స్.. మీ పిల్లలను వీధి కుక్కలతో ఆడుకోవడానికి అలాగే ప్రకృతితో బంధం ఏర్పరచుకోవడానికి ఎందుకు పంపకూడదు?’, ‘వీధుల్లో కుక్కలను స్వేచ్ఛగా ఉంచాలనుకుంటున్నారా? అలా అయితే పెంపుడు.’, ‘జంతువులను కూడా వీధుల్లోకి పంపించండి. అక్కడ అవి మీ పెడిగ్రీ తినకుండ, ఎయిర్ కండిషన్ లేకుండ ఎలా జీవిస్తాయో చూద్దాం!’..
కుక్కలకు ప్రత్యేకంగా సూల్స్ పెట్టండి..
‘పిల్లలతో సమానంగా కుక్కలకు కూడా హక్కులు ఉన్నాయని మీరు అంటున్నారు కదా. అయితే వీధి కుక్కల కోసం స్కూల్స్.. పిల్లల కోసం కెన్నెల్స్ నిర్మించండి.’, ‘మనుషులు ఎలా అయితే బతికే హక్కు ఉందో.. కుక్కలకు జీవించే హక్కు ఉంది కదా. అయితే ఈసారి మీరు అస్వస్థతకు గురైనప్పుడు పశువైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోండి.’, ‘మీరేందుకు మీ ఏసీ గదులు ఖాళీ చేసి అక్కడ వీధి కుక్కలను నిద్రపోయేలా చేయకూడదు. అలా చేస్తే మీ డాగ్ లవర్స్ అందరికి సంతోషమే కదా.’,’మనుషుల కంటే కూడా వీధి కుక్కలకు ఎక్కువ విలువు ఇస్తున్నారు కదా. అలాంటప్పుడు గుడిలో దేవుడికి బదులు వీధి కుక్కలను పెట్టి ప్రార్థించండి.’, ‘కుక్కలను రక్షించండి.. చిన్నారు చంపండి అనే నినాదంతో డాగ్ లవర్స్ అంత కూడా ఓ ఫౌండేషన్ స్థాపించకూడదు.’ అంటూ కామెంట్స్ చేశారు.
HERE are some FANTASIC SOLUTIONS for DOG LOVERS regarding their Mmmmuuuaahhh for STREET DOGS
1.Why don’t you adopt all the poor people and bring them into your homes and leave the streets for the dogs?
2.If dogs are like your family, then why not marry your Labradors, Huskies…— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025
అలాగే పేద ప్రజలపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. కదా అలా జరగకూడదంటే స్లమ్‌లో ఉన్న పేద ప్రజలను మీ గేటెడ్ కమ్యూనిటీకి తరలిచింది.. మీ లాబ్రడార్లను వీధుల్లోకి పంపండి. ఇలా ఆర్జీవీ డాగ్ లవర్స్ టార్గెట్ చేస్తూ వారికి కౌంటర్స్ విసురుతున్నారు. కాగా వీధి కుక్కల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న డాగ్ లవర్స్ ఖండిస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం తన తీర్పు వెనకకు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో వేదికగా భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సేవ్ స్ట్రే డాగ్స్ పేరుతో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. కాగా దేశరాజధాని డీల్లీలో వీధి కుక్కల వీరంగం వల్ల ఎంతో మంది రెబిస్ వ్యాధి బారిన పడుతున్నారు. డిల్లీ వీధి కుక్కల దాడుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో సుప్రీం కోర్టు ఈ కేసు సుమోటోగా తీసుకుంది. 8 వారాల్లో వీధి కుక్కలను ప్రత్యేక షెల్టర్ ఏర్పాటు చేసి వాటిని తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై సినీ సెలబ్రిటీస్, డాగ్ లవర్స్ అంతా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ram Gopal Varma: కుక్కల కోసం కాదు.. మనుషుల కోసం ఏడ్వండి… జంతు ప్రేమికులపై ఆర్జీవీ కౌంటర్