BigTV English

Koratala Siva: దేవర 2 సినిమా లేనట్లేనా, నాగచైతన్యకు కథ చెప్పిన కొరటాల

Koratala Siva: దేవర 2 సినిమా లేనట్లేనా, నాగచైతన్యకు కథ చెప్పిన కొరటాల

Koratala Siva: రచయితగా కెరియర్ మొదలుపెట్టిన కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడుగా మారాడు. దర్శకుడుగా మారకముందే రచయిత గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రభాస్ నటించిన మిర్చి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. అప్పటికే అందరూ బాహుబలి గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. కానీ సడన్ గా మిర్చి సినిమా వచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకుంది.


మిర్చి సినిమా తర్వాత కొరటాల శివ చేసిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా దాదాపు 200 కోట్లకు దగ్గరగా కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఒక్క తెలుగు సినిమా ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడితో కొరటాల శివ రేంజ్ మారిపోయింది. కొరటాల శివ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే అంచనాలు తారస్థాయికి వెళ్లిపోయాయి. ఆచార్య సినిమా ముందు వరకు కూడా కొరటాల శివ కి అదే రేంజ్ ఉండేది.

దేవర 2 లేనట్లేనా.?


మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామందికి ఒక కల ఉంటుంది. అయితే అది కొరటాల శివ కి నెరవేరింది. కానీ అది ఒక పీడకల అయిపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా దేవర అనే పాన్ ఇండియా సినిమా చేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. సినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పట్లో సిక్వెల్ వచ్చే అవకాశం లేదు అని తెలుస్తుంది. మరి కొంతమంది మాత్రం సోషల్ మీడియా వేదికగా సీక్వెల్ క్యాన్సిల్ అయిపోయింది అని విషయం స్పెండ్ చేస్తున్నారు.

నాగచైతన్య తో  సినిమా

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు అని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కొరటాల శివ నాగచైతన్య (Naga Chaitanya) కథను చెప్పారట. ఆ కథ కూడా నాగచైతన్యకు విపరీతంగా నచ్చిందట. ప్రస్తుతం ఈ సినిమా పట్టాలెక్కుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా పట్టాలెక్కుతుంది కాబట్టి ఎన్టీఆర్ చేయాల్సిన దేవర 2 సినిమా క్యాన్సిల్ అయింది అని మరోపక్క ఫేక్ న్యూస్ పెడ్ అవుతుంది. నాగచైతన్య సినిమా గురించి ఇంకా అప్డేట్ రాలేదు. ఒకవేళ నాగచైతన్య తో కొరటాల సినిమా చేసిన కూడా దేవర సినిమా ఉండటం అయితే మాత్రం ఖాయం.

Also Read: Telugu Producer : ఆ నిర్మాత సైలెంట్ ప్లేస్ లో – మీడియా ముందుకు రాను

Related News

Anil Sunkara: 1 – నేనొక్కడినే… దూకుడు రికార్డులన్నీ కొడదాం అని ప్లాన్ చేశాం

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి టాలీవుడ్ పంచాయితీ, మరో కీలకమైన మీటింగ్

Social Look: దిశా పటానీ అందాల అరాచకం.. రెడ్‌ డ్రెస్‌లో రెజీనా హాట్‌ లుక్స్‌

Ram Gopal Varma: మీ లాబ్రడార్, హస్కీలతో వీధి కుక్కలకు పెళ్లి చేయండి.. డాగ్‌ లవర్స్‌కి ఆర్జీవీ మరో కౌంటర్‌..

Nithin -Shalini:  కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు..  కొత్తగా ఉందే?

Big Stories

×