BigTV English

Nithin -Shalini:  కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు..  కొత్తగా ఉందే?

Nithin -Shalini:  కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు..  కొత్తగా ఉందే?

Nithiin – Shalini: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నటుడు నితిన్ (Nithin)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నితిన్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే నితిన్ తన కెరీర్ లో సక్సెస్ సినిమాల కంటే కూడా ఫెయిల్యూర్ సినిమాలనే ఎక్కువగా చవి చూశారని చెప్పాలి. ఎంతో విభిన్నమైన కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ నితిన్ మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు.


మగ బిడ్డకు జన్మనిచ్చిన నితిన్ దంపతులు..

ఇటీవల తమ్ముడు (Thammudu)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయనకు మరోసారి నిరాశ ఎదురయింది.. ఇలా వృత్తిపరమైన జీవితం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే.. నితిన్ షాలిని కందుకూరి (Shalini Kandukuri)అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులకు గత ఏడాది పండంటి మగ బిడ్డ (Baby Boy)జన్మించారు. తన ఇంటికి వారసుడు వచ్చాడు అంటూ నితిన్ గత ఏడాది సెప్టెంబర్ ఆరో తేదీ తన కొడుకు పుట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.


జన్మాష్టమిని పురస్కరించుకొని..

ఇలా కొడుకు పుట్టిన సంగతి అభిమానులకు చెప్పినప్పటికీ తన కుమారుడి ఎలా ఉంటాడు ఏంటి అనే విషయాలను మాత్రం ఇప్పటివరకు రివిల్ చేయలేదు. అంతేకాకుండా తన కొడుకు పేరును కూడా ఇప్పటివరకు అభిమానులతో పంచుకోలేదు. తాజాగా నితిన్ సోషల్ మీడియా వేదికగా తన కొడుకు పేరును బయటపెట్టారు.. సరైన రోజు, ముహూర్తం చూసుకొని ఈ జంట తమ కొడుకు పేరును రివీల్ చేశారని తెలుస్తోంది. చిన్నారికి అవ్యుక్త్ (Avyukth)అని నామకరణం చేసినట్లు తెలియజేశారు. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమిని (Sri Krishna Janmastami)పురస్కరించుకొని ఈ దంపతులు తమ చిన్నారి పేరును రివీల్ చేశారు.

ఇలా నితిన్ దంపతులు తమ కొడుకు పేరును రివీల్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పేరు గురించి తెలిసిన అభిమానులు పేరు చాలా కొత్తగా ఉంది అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు ఈ పేరుకు అర్థం ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు.అవ్యుక్త్ అనే పేరు శ్రీకృష్ణుడిని చూచిస్తుంది. ఇలా శ్రీకృష్ణునికి సంబంధించిన ఈ పేరును జన్మాష్టమి రోజు అభిమానులతో పంచుకున్నారు. జన్మాష్టమి రోజు తమ కొడుకు పేరును రివీల్ చేయడం తమకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక నితిన్ కెరియర్ విషయానికి వస్తే తమ్ముడు సినిమా ద్వారా నిరాశ ఎదుర్కొన్న నితిన్ త్వరలోనే బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ(Yellamma) సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. బలగం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వేణు ఎల్లమ్మ సినిమాని ప్రకటించారు. ఈ సినిమా కూడా దిల్ రాజు నిర్మాణం లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: Anshu Reddy -sree priya: త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం..షాక్ ఇచ్చిన బుల్లితెర నటీమణులు!

Related News

Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బ్లాస్ట్, సీక్రెట్స్ రీవీల్ చేసిన జాన్వీ కపూర్  

Rishab Shetty : వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి, అప్పుడు తెలుగులో మాట్లాడుతా

Naga Vasmsi: సినిమా హక్కుల కోసం నాగ వంశీ ప్రయత్నం, ప్రభాస్ తో పోటీ అవసరమా?

Mega158 : మెగాస్టార్ సినిమా ముహూర్తం క్యాన్సిల్? ఆ సెంటిమెంట్ కోసమే వెయిటింగ్

Dimple Hayathi: వివాదంలో డింపుల్ హయతి… రహస్యంగా పెళ్లి కూడా చేసుకుందా?

Priyanka Mohan : పవన్ తో OG బ్యూటీ రొమాంటిక్ ఫోజులు.. ఆ క్లోజ్ నెస్ చూశారా?

Poonam Kaur: బాలయ్య vs చిరంజీవి.. పూనమ్ సంచలన పోస్ట్…అగ్గి రాజేసిందిగా!

IMDB Movie list: 25 ఏళ్లలో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ జాబితాలో ప్రభాస్, బన్నీ మూవీలు!

Big Stories

×