Pawan Kalyan vs Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుపై రోజు రోజుకు ఆశలు తగ్గిపోతున్నాయి. ఈ నెల 12న రిలీజ్ కావాల్సింది. కానీ, బిజినెస్ జరగకపోవడం, VFX పనులు పూర్తవ్వకపోవడంతో వాయిదా వేశారు. వాయిదా పడి 8 రోజులు అవుతున్నా… మూవీ యూనిట్ అసలేం సౌండ్ రావడం లేదు. వాయిదా వేసిన తర్వాత కొత్త రిలీజ్ డేట్ కానీ, లేదా ట్రైలర్ అనౌన్స్‌మెంట్ కానీ ఇలా ఏదో ఒక అప్డేట్ కూడా రావడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులే సినిమాపై ట్రోల్స్ చేస్తున్నారు.
దాదాపు 6 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న సినిమా. ఆశలన్నీ వదులుకున్న తరుణంలో పవన్ వచ్చి ఊపిరిపోశాడు. బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేయడం, రిలీజ్ డేట్ ను ప్రకటించడం అని చక చక జరిగిపోయాయి. ఇక జూన్ 12న వీరమల్లు ఆగమనం ఉంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, VFX పనులు పూర్తి కాలేదు. అన్నింటి కంటే మెయిన్ పాయింట్ బిజినెస్ అవ్వలేదు.
నిర్మాతలు భారీగా ధరకు కోట్ చేయడంతో బయ్యర్లు ముందుకు రావడానికి భయపడిపోయారు. ఎంత పవన్ సినిమా అయినా.. కంటెంట్ పై బజ్ లేకపోతే ఓపెనింగ్స్ రావు. అందుకే నిర్మాతలు అడిగినంత ఇవ్వడానికి బయ్యర్లకు ధైర్యం కాలేదు. ఫలితం సినిమా వాయిదా పడింది.
రిలీజ్ డేట్ రూమర్స్
జూన్ 12 నుంచి వాయిదా పడిన తర్వాత వీరమల్లు రిలీజ్ డేట్ ఇదే అని కొన్ని డేట్స్ ఇటు ఇండస్ట్రీలో అటు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి. వాటి గురించి కూడా మూవీ యూనిట్ స్పందించడం లేదు. ఆ వార్తల్లో నిజం లేదు. నిజం ఉంది అనే రియాక్షన్ అయినా రావడం లేదు.
ఓజీతో క్లాష్ అవ్వండి ఇక
అటు అప్డేట్స్ లేవు. ఇటు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ లేదు. ట్రైలర్ లేదు. పైగా నిర్మాతలు సైలెన్స్… ఇవి అన్నీ చూసి పవన్ అభిమానులు కూడా విసిగిపోయారు. విసిగిపోయి… సినిమాపై ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు.
నిర్మాత ఏఎం రత్నంను ట్యాగ్ చేస్తూ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. ఓజీతో క్లాష్ పెట్టుకోండి ఇక అంటూ మెసెజెస్ చేస్తున్నారు. ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. అది పవన్ కళ్యాణ్ బర్త్ డే. అదే రోజు ఈ సినిమాను కూడా రిలీజ్ చేసి ఓజీ వర్సెస్ వీరమల్లు అవుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
కింగ్‌డంతో పోటీ ?
గత కొన్ని రోజుల నుంచి వీరమల్లు రిలీజ్ డేట్‌పై కొన్ని వార్తలు వచ్చాయి. హరి హర వీరమల్లు ఓటీటీ రైట్స్ తీసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లకు మూవీ యూనిట్ కి ఓ మీటింగ్ జరిగిందట. ఆ మీటింగ్‌లో హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ను జూలై 25 అని అమెజాన్ వాళ్లు ఫిక్స్ చేశారట. ఆ డేట్ నుంచి కూడా వాయిదా పడితే ఓటీటీ డీల్ లో చేసుకున్న ప్రైజ్ పై కోతలు భారీగా విధిస్తామని చెప్పరట. దీంతో మేకర్స్ ఆ.. డేట్‌నే ఫిక్స్ చేశారనే వార్తలు వచ్చాయి.
మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో అని చెప్పాల్సిన బాధ్యత మూవీ టీందే. కానీ, వాళ్లు ఎప్పటి లానే సైలెంట్ మెయింటెనెన్స్ చేస్తున్నారు.