BigTV English

Suriya 45: సూర్య కొత్త మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్.. వేట కొడవళ్లతో ఆట మొదలు!

Suriya 45: సూర్య కొత్త మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్.. వేట కొడవళ్లతో ఆట మొదలు!

Suriya 45:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) చివరిగా ‘రెట్రో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, డిజాస్టర్ ను చవిచూసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో నటించేందుకు సూర్య సిద్ధమయ్యారు.


ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో సూర్య కొత్త మూవీ..

రేడియో జాకీగా కెరియర్ ను ఆరంభించిన బాలాజీ మల్టీ టాలెంటెడ్ కూడా.. నటుడు, గాయకుడు మాత్రమే కాదు..దర్శకుడిగా కూడా సత్తా చాటారు. నయనతార (Nayanthara) కీలక పాత్రలో బాలాజీ రూపొందించి , నటించిన చిత్రం ‘ అమ్మోరు తల్లి’ . ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ‘వీట్ల విశేషం’ సినిమాను సత్యరాజ్ (Sathyaraj)తో చేసి మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు మూడోసారి హీరో సూర్యతోనే సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గతంలో తనకు అవకాశం ఇచ్చిన సూర్య కి ధన్యవాదాలు చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తపరచిన విషయం తెలిసిందే.


#సూర్య 45 మూవీ టైటిల్ రిలీజ్..

ఇప్పుడు ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అడుగు ముందుకు వేశారు ఆర్జే బాలాజీ. అందులో భాగంగానే సూర్య – ఆర్జే బాలాజీ కాంబినేషన్లో వస్తున్న #Suriya 45 మూవీకి సంబంధించిన టైటిల్ తో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో చాలా రౌద్రంగా కొడవళ్ళు పట్టుకొని సూర్య సీరియస్ గా ఉన్నట్టు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అంతే కాదు ‘కరుప్పు’ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మొత్తానికి అయితే సూర్య 45వ చిత్రానికి సంబంధించిన ఈ పోస్టర్, టైటిల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

#సూర్య 45 సినిమా విశేషాలు..

ఈ కరుప్పు సినిమా విషయానికి వస్తే.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ మూవీగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఏడాదికి పైగా స్క్రిప్ట్ పై కసరత్తు చేసిన చిత్ర బృందం.. సినిమాకు సంబంధించిన లొకేషన్లను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు 120 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి అనుకున్న టైం కి ఈ సినిమాను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

సూర్య సినిమాలు..

సూర్య విషయానికొస్తే నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా సినిమాలు చేసి మార్కెట్ పెంచుకున్న ఈయన ‘ నెరుక్కు నేర్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘సూర్య నందా’ అనే చిత్రంతో మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇక తమిళ్లోనే కాదు తెలుగులో కూడా సినిమాలు చేసి సత్తా చాటుతున్నారు.

also read:HHVM: పవన్ కళ్యాణ్ మూవీకి కూడా తప్పని తిప్పలు.. నిర్లక్ష్యమే కారణమా?

Related News

Coolie: కూలీ కు అనుకూలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కారణం అదేనా?

Coolie: ప్రసాద్ ఐమాక్స్ లో పిల్లలపై ఆంక్షలు… షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేనేజ్మెంట్

Anupama: నా సినిమాలలో ఇప్పటివరకు నచ్చని పాత్ర అదే!

Coolie Vs Leo: కూలీ టార్గెట్‌ ‘లియో’.. ఫస్ట్‌ డే ఎంత కొట్టాలంటే..

Sandeep Reddy Vanga: స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ అక్కడే.. ప్లేస్ తోనే అంచనాలు పెంచేశారుగా!

Coolie : వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ, హిట్ టాక్ వస్తే కానీ గట్టెక్కదు

Big Stories

×