Film industry: ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమలో వరుస మరణాలు సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో విషాదం ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడి భార్య కన్నుమూశారు. అసలు విషయంలోకి వెళ్తే.. తెలుగు , కన్నడ చిత్రాలతో అటు దర్శకుడిగా.. ఇటు నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్న బండారు గిరిబాబు (Bandaru Giribabu) సతీమణి సత్యవతి (Satyavathi) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇకపోతే ప్రముఖ నటుడు రంగనాథ్ (Ranganath ) ను సినీ పరిశ్రమకు ‘చందన’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసింది గిరిబాబే కావడం గమనార్హం. ఈయన 1994 లోనే తుది శ్వాస విడిచారు. ఇక అప్పటి నుంచి మిగతా కుటుంబ సభ్యులతో ఉంటున్న ఈయన భార్య సత్యవతి ఇప్పుడు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి అటు సినీ పరిశ్రమ ఇటు అభిమానులు ఆమె మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గిరిబాబు కూతురు ఎవరో తెలుసా..
ఇకపోతే గిరిబాబు – సత్యవతి దంపతుల పెద్ద కుమార్తె కూడా కన్నడలో పలు టీవీ సీరియల్స్ లో నటించింది. అంతేకాదు యాడ్ ఫిలిమ్స్ ని కూడా ఈమె చేయడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈవిడ కూడా 10 సంవత్సరాల క్రితమే కన్నుమూశారు.
గిరిబాబు రీమేక్ చేసిన చిత్రాలు..
తెలుగులో జీవితం, రత్తాల రాంబాబు, చందన వంటి చిత్రాలను తీసిన గిరిబాబు అలాగే బొమ్మరిల్లు, నాలుగు స్తంభాలాట సినిమాలను అప్పట్లో కన్నడాలో రీమేక్ చేసి మంచి విజయం అందుకున్నారు. అంతే కాదు మరో మూడు సినిమాలను కూడా ఆయన కన్నడలో రీమేక్ చేయడం జరిగింది. ఇకపోతే అరకులోయ అందాలను మొదటిసారి తమ సినిమాలలో చూపించింది కూడా ఈయనే కావడం గమనార్హం. ఇకపోతే ఈయన రూపొందించిన ప్రతి సినిమాకి కూడా డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్యం తప్పనిసరిగా ఉండేది. రమేష్ నాయుడు సంగీతాన్ని అందించేవారు.
కర్ణాటక ఫిలిం ఛాంబర్ లో సభ్యుడిగా గిరిబాబు..
ఒకవైపు నిర్మాతగా ..మరొకవైపు దర్శకుడిగా బాధ్యతలు చేపడుతూనే.. మరొకవైపు కర్ణాటక ఫిలిం ఛాంబర్ లో సభ్యులుగా కూడా కొనసాగారు.
గిరిబాబు కుటుంబ జీవితం..
గిరిబాబు – సత్యవతి దంపతులకు కుమారుడు సత్యదేవ్.. ఇద్దరు కుమార్తెలు అపర్ణ, శ్రీ చందన కూడా ఉన్నారు. స్వర్గీయ గిరిబాబు పెద్ద మనవడు బండారు భరత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మూడు చిత్రాలలో హీరో గా నటించి, ఇప్పుడు సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలా ఈయన కుటుంబానికి చెందిన చాలా మంది ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఇక సత్యవతి మరణంతో ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతికి లోనవుతోంది. కుటుంబ సభ్యులకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ALSO READ:Rashmika Mandanna: విలన్‌గా మారుతున్న రష్మిక… పుష్పరాజ్‌ను ఢీ కొట్టే పవర్ ఫుల్ రోల్