CM Revanth Reddy: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. పరిమిత వాహనాలతో సామాన్యుడిలా అక్కడకు చేరుకొని నిమజ్జన కార్యక్రమాలను పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అకస్మాత్తుగా ఎన్టీఆర్ గార్డన్ వద్దకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించి, ప్రజలను ఇబ్బంది తలెత్తకుండా చేయాలని అధికారులకు సూచించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాలను తిలకింది, ప్రజలందరికి ఆప్యాయంగా పలకరించారు. ఇబ్బందిగా ఉంటే అధికారులకు సంప్రదించాలని ప్రజలకు సూచించారు. అక్కడకు వచ్చిన భక్తులను ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించారు. నిమజ్జనానికి పరిశీలించేందుకు తొలిసారి తెలంగాణ సీఎం రావడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర సీఎం కూడా ఇలా ప్రజల వద్దకు వచ్చి ఏర్పాట్లను పరిశీలించలేదని తెలిపారు.
ట్యాంక్ వద్దకు సీఎం రేవంత్ రావడంతో, ప్రజలు ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అప్పటి వరకు జై జై గణేషా అంటూ పలికిన వారందరూ సీఎం సీఎం అనే నినాదాలు చేశారు. ప్రజలు ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాలు చూడాలని, ఎటువంటి ఇబ్బందికి లోను కాకూడదని సూచించారు. నిమజ్జనానికి వచ్చిన గణేష్ విగ్రహాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను తెలిపారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాని పేర్కొన్నారు. అక్కడకు వచ్చిన వారందరిని పలకరించిన అనంతరం సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read also: Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 12 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్
హైదరాబాద్ ట్యాంక్ బండ్ గణేష్ నిమజ్జనాలకు వేదిక అయ్యింది. నగరవ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ కు తరలివస్తున్నారు. కొద్ది సేపటి క్రిటమే ఖైరతా బాద్ వినాయుడు హుస్సేస్ సారగ్ లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు అధికారులు. ఎటువంటి ఆటంకం లేకుండా భారీ ఖైరతాబాద్ వినాయకుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఈ వేడుకను చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఈనేపథ్యంలో హుస్సేన్ సాగర జై గణేషా అనే నినాదాలతో మారు మోగింది. అక్కడకు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే..
ఎలాంటి ప్రోటోకాల్, ఎస్కార్ట్ లేకుండా మూడు వాహనాల్లో ట్యాంక్ బండ్ కు వచ్చి భక్తులు, స్థానికులందరినీ ఆశ్చర్యపరిచిన సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/338ICCrCaq
— BIG TV Breaking News (@bigtvtelugu) September 6, 2025